ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CMRF: రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ మంజూరు

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:12 AM

పట్టణానికి చెందిన ఓ రోగి ఆపరేషన కోసం ఎమ్మెల్యే గుమ్మనూరు జ యరాం రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ లెట ర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ)ను మంజూరు చేయించారు.

MLA Jayaram handing over the LoC to Adiseshu's family member

గుంతకల్లు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన ఓ రోగి ఆపరేషన కోసం ఎమ్మెల్యే గుమ్మనూరు జ యరాం రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ లెట ర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ)ను మంజూరు చేయించారు. గుంతకల్లులోని పోర్టర్స్‌లైన ప్రాంతానికి చెందిన బంగ్లా ఆదిశేషు అనే వ్యక్తికి లివర్‌ ట్రాన్సప్లాంటేషన చేయాల్సిన పరిస్థితులేర్పడటంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు. రోగి పరిస్థితిని ఎమ్మెల్యే ప్రభుత్వం, సీఎంఆర్‌ఎఫ్‌ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఆపరేషనకు అయ్యే ఖర్చులో రూ.10 లక్షల వరకూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాదు, జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ పేరిట రూ.10 లక్షల నిధిని ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ సీఎంఆర్‌ఎఫ్‌ సహాయ కార్యదర్శి ఎన లక్ష్మీ పద్మజ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను జారీచేశారు. ఆపరేషన పూర్తయిన తర్వాత ఆసుపత్రి బిల్లులను పొందుపరచిన వెంటనే రూ.10 లక్షలను విడుదలచేసేలా ఎల్‌ఓసీని ఎమ్మెల్యే జయరాంకు ఇవ్వగా, ఆయన మంగళవారం బాధిత కుటుంబ సభ్యుడికి విజయవాడలో అందజేశారు.

Updated Date - Nov 20 , 2024 | 12:12 AM