ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:52 AM

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని కోటవీధిలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం బొప్పేపల్లి గ్రామ సమీపంలో రైతు వాసుదేవ పొలంలో రూ.92వేల వ్యయంతో నిర్మించిన ఫారంపాండ్‌ను ప్రారంభించారు.

బొప్పేపల్లిలో పొలంబడిలో పాల్గొన్న కలెక్టర్‌ తదితరులు

- పింఛన్లపంపిణీ, పొలం పిలుస్తోంది కార్యక్రమాలకు హాజరు

యల్లనూరు, అక్టోబరు 1: కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని కోటవీధిలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం బొప్పేపల్లి గ్రామ సమీపంలో రైతు వాసుదేవ పొలంలో రూ.92వేల వ్యయంతో నిర్మించిన ఫారంపాండ్‌ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఈ రైతుతో మాట్లాడుతూ ఫారంపాండ్‌ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. బోరులో నీరు తక్కువగా వచ్చినప్పుడు ఇందులో నిల్వ ఉన్న నీటిని పొలానికి ఉపయోగించుకోవచ్చునని రైతు సమాధానమిచ్చారు. తర్వాత అక్కడే పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని జేడీఏ ఉమామహేశ్వరితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శైలజ అధునాతన యంత్రాల ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రంగారావు, ఎంపీడీఓ వీర్రాజు, డిప్యూటీ తహసీల్దార్‌ బాషా, ఈఓఆర్డీ విజయశేఖర్‌నాయుడు, వ్యవసాయ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 02 , 2024 | 12:52 AM