ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SANITATION WORKERS: జీతాల కోసం ఆస్పత్రి కార్మికుల ఆందోళన

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:03 AM

ఐదు నెలలైనా జీతాలు ఇవ్వలేదు, ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నామని వేడుకుంటూ అధికారులు కనికరించడం లేదు, పండుగకు కూడా జీతాలు ఇవ్వకుండా పస్తులు పెడతారా అంటూ ఆస్పత్రి పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Sanitation workers protesting in front of medical college

అనంతపురం టౌన, సెప్టెంబరు 6: ఐదు నెలలైనా జీతాలు ఇవ్వలేదు, ఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నామని వేడుకుంటూ అధికారులు కనికరించడం లేదు, పండుగకు కూడా జీతాలు ఇవ్వకుండా పస్తులు పెడతారా అంటూ ఆస్పత్రి పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక వైద్యకళాశాల ప్రధానగేటు వద్ద పారిశుధ్య కార్మికులు జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజే్‌షగౌడ్‌, నాయకులు చిరంజీవి, కృష్ణుడు, వెంకటేష్‌, ప్రశాంత మద్దతు ఇవ్వగా కార్మికులు కళాశాల గేటుముందు బైఠాయించి వైద్యాధికారులు, కాంట్రాక్టర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం వరకు గడువు ఇస్తున్నామని అప్పటిరీ జీతాలు ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. నారప్ప, పెద్దన్న, షామీదాతోపాటు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:03 AM

Advertising
Advertising