STAFF NURSES: జిల్లావ్యాప్తంగా స్టాఫ్‌నర్సుల ఆందోళన
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:15 AM
తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు చేపడుతున్న ఉద్యమం ఊపందుకుంది. రెండురోజులుగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తున్నారు.
అనంతపురం టౌన, సెప్టెంబరు11: తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు చేపడుతున్న ఉద్యమం ఊపందుకుంది. రెండురోజులుగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. బుధవారం స్టాఫ్‌నర్సులు ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా మొదలయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో వందలాదిమంది స్టాఫ్‌నర్సులు విధులు బహిష్కరించి మూడోరోజు ఆందోళన చేపట్టారు. జీఓ 115ను రద్దుచేయాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్టాఫ్‌నర్సులు మాట్లాడుతూ 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ వస్తున్నామన్నారు. రెగ్యులర్‌తో పాటు సమానసనికి సమాన వేతనం ఇవ్వడంలేదన్నారు. రెగ్యులర్‌చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పుకుంటూ వస్తున్నా అమలుచేయకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం మళ్లీ స్టాఫ్‌నర్సులు నియామకాల నోటిఫికేషనకు జీఓ115ను విడుదల చేశారన్నారు. దీనివల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. స్టాఫ్‌నర్సులు సంఘం నాయకులు పద్మలత, శ్రీదేవి, కళావతి, శోభ, అనితతోపాటు నర్సులు పాల్గొన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 12:15 AM