CORPORATION: నగరపాలికలో ఇరువర్గాల గొడవ
ABN, Publish Date - Nov 02 , 2024 | 12:23 AM
నగరపాలిక మెయిన హాల్‌లో శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మెడపట్ల వరకూ వ్యవహారం వెళ్లింది.
అనంతపురం క్రైం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): నగరపాలిక మెయిన హాల్‌లో శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మెడపట్ల వరకూ వ్యవహారం వెళ్లింది. 2020 నుంచి 2024 వరకు 26మంది పారిశుధ్య కార్మికులకు వేతనాలు పడలేదని సీఐటీయూ నాయకులు వెంకటరమణ, ఏటీఎం నాగరాజు, నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి హర్ష కారణమని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఓ సంఘం పేరుతో నాయకత్వం నడిపిస్తున్న అజయ్‌బాబు, నగరపాలికలో పనిచేస్తున్న వెంకటేష్ కొందరితో కలిసి అక్కడికి వచ్చారు. హర్షకు మద్దతుగా మాట్లాడారు. ఈ క్రమంలో రెండువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది తీవ్రస్థాయికి చేరి కొందరు మెడపట్లు పట్టుకున్నారు. ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఇలా జరిగినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
Updated Date - Nov 02 , 2024 | 12:23 AM