విగ్రహాల ఏర్పాటుకు స్థలాల పరిశీలన
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:53 AM
పట్టణంలోని పలు ప్రాంతా ల్లో వివిధ విగ్రహాలను ఏ ర్పాటు చేసేందుకు గాను శనివారం మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థలాలను పరిశీలించారు.
తాడిపత్రి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ప్రాంతా ల్లో వివిధ విగ్రహాలను ఏ ర్పాటు చేసేందుకు గాను శనివారం మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థలాలను పరిశీలించారు.
స్థానిక ఫ్లైఓవర్ వద్ద 20 అడుగుల శివుడి విగ్రహం, చుక్కలూరురోడ్డులోని పెట్రోల్ బంక్ సర్కిల్లో గ్రానైట్ కార్మికుడి విగ్రహం, సజ్జలదిన్నె పాతబ్రిడ్జి సర్కిల్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన చిహ్నాలు, కడపరోడ్డులోని ఐశ్వర్యవిల్లాస్ సమీపంలో పచ్చదనం కనిపించే చిహ్నాలను ఏర్పాటు చేయనున్నారు. శివుడి విగ్రహానికి రూ.20 లక్షలు, గ్రానైట్ కార్మికుడి విగ్రహానికి రూ.16లక్షలు, మతాల చిహ్నాలకు రూ.18లక్షలు, పచ్చదనం చిహ్నాలకు రూ.16లక్షలు ఖర్చుచేయనున్నారు. మొత్తం ఈ విగ్రహాల ఏర్పాటుకు జేసీపీఆర్ రూ.70లక్షల సొంత నిధులను ఖర్చుచేయనున్నారు. విగ్రహాలను తయారుచేసే పనిని రాజమండ్రికి చెందిన ప్రముఖ శిల్పి నరేంద్రకు అప్పగించారు. దశలవారీగా విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి పనులను ప్రారంభించనున్నారు. ఆయన వెంట శిల్పి నరేంద్ర, టీడీపీ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, పవనకుమార్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, నరేంద్రనాయుడు, సుదర్శన, తిరుపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 17 , 2024 | 12:53 AM