ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: శవ రాజకీయాలు సిగ్గుచేటు

ABN, Publish Date - Jul 20 , 2024 | 11:52 PM

వినుకొండలో వ్యక్తిగతంగా జరిగిన హత్యపై జగనమోహనరెడ్డి రాజకీయరంగు పులిమి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ మండిపడ్డారు.

Telugu youth leader Bangi Naga is speaking

అనంతపురం అర్బన, జూలై 20: వినుకొండలో వ్యక్తిగతంగా జరిగిన హత్యపై జగనమోహనరెడ్డి రాజకీయరంగు పులిమి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సత్యకుమార్‌, వడ్డే హనుమంతరావు, వన్నూరు, రామాంజనేయులు, సుజాతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం జగన హత్యారాజకీయాలు చేశారన్నారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న దుర్మార్గుడు జగన అన్నారు. ఎమ్మెల్సీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్‌డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చారన్నారు. జగన సొంత జిల్లాలో దళిత మహిళను హత్య చేసినా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించలేదన్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్తలు గంజాయి మత్తులో గొడవపడి హత్య చేస్తే వాస్తవాలను తొక్కిపెట్టి టీడీపీకి అంటగట్టడం సిగ్గుచేటన్నారు. అనిల్‌కుమార్‌, సాయికుమార్‌, ప్రసాద్‌, జనార్ధన, శ్రీనివాసులు, ఆంజనేయులు, కృపాకర్‌, మాధవ్‌, శివ, ఉదయ్‌కుమార్‌, అరవింద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2024 | 11:52 PM

Advertising
Advertising
<