ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అవినీతిపరులను జైలుకు పంపుతాం

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:08 AM

అవినీతికి పాల్పడిన వారందరిని తప్పకుండా జైలుకు పంపుతామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ అన్నారు.

మాట్లాడుతున్న సత్యకుమార్‌, చిత్రంలో పరిటాల శ్రీరామ్‌ తదితరులు

ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌

తాడిమర్రి, ఏప్రిల్‌ 7: అవినీతికి పాల్పడిన వారందరిని తప్పకుండా జైలుకు పంపుతామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికిముఖ్య అతిథులుగా నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, లలితకుమార్‌, ప్రకాశనాయుడు హాజరయ్యారు. సత్యకుమార్‌ మాట్లాడుతూ ఒకవైపు తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జగన మాత్రం భారతి సిమెంట్‌ కంపెనీకి, భావమరిది కంపెనీలకు ప్రత్యేకంగా నీటిని తీసుకెళుతున్నాడన్నారు. నేను ఆంధ్రప్రదేశకు కొత్తవాడిని కాదని, ధర్మవరం నియోజకవర్గంలో నాకు తెలిసిన వారున్నారన్నారు. మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచినియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చాననన్నారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ తనకు ఎలాంటి సహకారం అందించారో అంతకు రెట్టింపు సహకారాన్ని సత్యకుమార్‌కు అందించి నియోజకవర్గానికి ఒక బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామన్నారు. టీడీపీ నాయకులు కూచి రామ్మోహన, జనార్దననాయుడు, విజయ్‌కుమార్‌, హర్షవర్దన, రాజశేఖర్‌, సాయి, విశ్వనాథ్‌, ఆత్మకూరు శ్రీనివాసులు, కునుకుంట్ల యల్లప్ప, బద్రి, బీజేపీ గంగులకుంట గోపాల్‌రెడ్డి, పోతలయ్య పాల్గొన్నారు.

శ్రీరామ్‌కున్న మెచ్యూరిటీ.. ఆ వయసులో నాకు కూడాలేదు

బత్తలపల్లి: పరిటాల శ్రీరామ్‌కు ఉన్న పరిజ్ఞానం తనకు కూడా లేదని ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ నాయకులతో సత్యకుమార్‌యాదవ్‌, పరిటాలశ్రీరామ్‌ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతున్న మాటలు ఆయన ఆలోచించే తీరు చూస్తుంటే ఇంత మెచ్యూరిటీ, అంతపరిజ్ఞానం నాకు కూడా ఆ వయసులోలేదన్నారు. పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ తొలిసారి ధర్మవరంలో బీసీ అభ్యర్థికి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీ నాయకులు గోనుగుంట్ల విజయ్‌కుమార్‌, జక్కంపూటి నాగభూషణం, లక్ష్మీనారాయణ, చల్లా శ్రీనివాసులు, ఉమాపతినాయుడు, చితంబరరెడ్డి, మందల శ్రీనివాసులు, నారాయణస్వామి, రవి, తాళ్లూరు సతీశ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:08 AM

Advertising
Advertising