ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BOOK RELEASE: విస్తృత వ్యాఖ్యానమే విమర్శ

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:21 AM

బాధాసర్పద్రష్టులైన ప్రజల జీవిత మూలాలను సూత్రప్రాయంగా వ్యక్తీకరించిన కవుల కవిత్వాన్ని విస్తృతమైన వ్యాఖ్యానంతో పాఠకునికి చేరవేయడమే కవిత్వ విమర్శ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

Mattipoo is a literary man who is inventing a book

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 29: బాధాసర్పద్రష్టులైన ప్రజల జీవిత మూలాలను సూత్రప్రాయంగా వ్యక్తీకరించిన కవుల కవిత్వాన్ని విస్తృతమైన వ్యాఖ్యానంతో పాఠకునికి చేరవేయడమే కవిత్వ విమర్శ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనలో సీనియర్‌ కవి తూముచెర్ల రాజారామ్‌ రచించిన ‘మట్టి పూలు’ పుస్తక ఆవిష్కరణ సభను స్పందన అనంత కవుల వేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరశాసి్త్ర అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, బండి నారాయణస్వామి ముఖ్యఅతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాయలసీమలో నివసిస్తున్న కవులందరూ రాయలసీమ కవులు కాదని, రాయలసీమ గురించి కవిత్వం రాసిన కవులే రాయలసీమ కవులని అభిప్రాయపడ్డారు. కవుల కవితాంతరంగాన్ని మట్టిపూలుగా సృజించిన విమర్శకవి రాజారామ్‌ అభినందనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ కవి రాధేయ, డాక్టర్‌ నాగేశ్వరాచారి, అంకె శ్రీనివాస్‌, తరిమెల అమరనాథరెడ్డి, టీవీ రెడ్డి, అశ్వత్థరెడ్డి, డాక్టర్‌ ప్రగతి, సుప్రియ, కృష్ణమూర్తి, సురేష్‌, పూజారి ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 12:22 AM