Agriculture : సేద్యం.. యుద్ధం
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:29 AM
ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నదాతలు సేద్యాన్ని వదలడం లేదు. ఎద్దులు దూరమైనా.. కన్న కొడుకుల భుజాలపై కాడెమాను మోపుతున్నారు. చదువుకుంటున్న పసివారు.. తండ్రికి తోడుగా పొలంలోకి దిగారు. ఇంటిల్లిపాదీ కష్టపడితేగాని అనంతలో వ్యవసాయం ముందుకు సాగదు. కంబదూరు మండలం నూతిమడుగు రైతు సర్దానప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇందులో టమోటా సాగు చేశాడు. కలుపు తీత పనులకు కూలీల ఖర్చులు భరించలేక.. తన ఇద్దరు ...
ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నదాతలు సేద్యాన్ని వదలడం లేదు. ఎద్దులు దూరమైనా.. కన్న కొడుకుల భుజాలపై కాడెమాను మోపుతున్నారు. చదువుకుంటున్న పసివారు.. తండ్రికి తోడుగా పొలంలోకి దిగారు. ఇంటిల్లిపాదీ కష్టపడితేగాని అనంతలో వ్యవసాయం ముందుకు సాగదు. కంబదూరు మండలం నూతిమడుగు రైతు సర్దానప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇందులో టమోటా సాగు చేశాడు. కలుపు తీత పనులకు కూలీల ఖర్చులు భరించలేక.. తన ఇద్దరు కొడుకులను పొలంలోకి దించాడు. ఎద్దులు లాగాల్సిన గుంటకను వారిచేత
లాగించారు. పదో తరగతి చదువుతున్న రాణా ప్రతాప్, ఇంటర్ చదువుతున్న కార్తీక్.. పొలం బాట పట్టడం రైతుల కష్టాలను కళ్లకు కడుతోంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వారికి ఆపన్న హస్తం అందించారు. సేద్యానికి అయ్యే ఖర్చులను, ఇద్దరి చదువుల ఖర్చులను తాను భరిస్తానని మాటిచ్చారు. గ్రామానికి వెళ్లి వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకోవాలని టీడీపీ నాయకులను పురమాయించారు.
- కళ్యాణదుర్గం
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 20 , 2024 | 12:29 AM