ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజకీయ కక్షతో మామిడి చెట్ల నరికివేత

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:09 AM

మండలంలోని కేతేపల్లికి చెందిన హనుమంతరాయప్ప పొలంలోని మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నరికివేశారు. రాజకీయ కక్షతోనే ఈ పని చేశారని బాధిత రైతు తెలిపారు. కేతేపల్లికి చెందిన రామాంజనేయులు, హనుమంతరాయప్ప అన్నదమ్ములు. వీరిలో రామాంజనేయులు టీడీపీ బూత ఇనచార్జ్‌, ఆయన తమ్ముడు హనుమంతరాయప్ప వైసీపీ నాయకుడు. హనుమంతరాయప్ప తనకున్న 1.30 ఎకరాల పొలంలో 90 మామడి చెట్లు పెంచారు

మడకశిర రూరల్‌, జూన 10: మండలంలోని కేతేపల్లికి చెందిన హనుమంతరాయప్ప పొలంలోని మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నరికివేశారు. రాజకీయ కక్షతోనే ఈ పని చేశారని బాధిత రైతు తెలిపారు. కేతేపల్లికి చెందిన రామాంజనేయులు, హనుమంతరాయప్ప అన్నదమ్ములు. వీరిలో రామాంజనేయులు టీడీపీ బూత ఇనచార్జ్‌, ఆయన తమ్ముడు హనుమంతరాయప్ప వైసీపీ నాయకుడు. హనుమంతరాయప్ప తనకున్న 1.30 ఎకరాల పొలంలో 90 మామడి చెట్లు పెంచారు. ప్రసుత్తం అవి కాపునకు వచ్చాయి. అందులో పది చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నరికివేశారు. దీంతో రూ.2 లక్షల వరకు నష్టవాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నారు. కాగా పార్టీలు వేరైనా అన్నదమ్ములు ఒక్కటే అని, వారి మధ్య రాజకీయంగా చిచ్చు పెట్టడం కోసం కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రణాళిక ప్రకారం హనుమంతరాయప్ప పొలంలోని మామిడి చెట్లు నరికి వేసినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై హనుమంతరాయప్ప సోమవారం పోలీస్టేషనకు వెళ్లారు. తన పొలంలోని మామిడి చెట్లను నరికివేసిన వారిని గుర్తించి, తగు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై మడకశిర సీఐ మనోహర్‌ మాట్లాడుతూ... కేతేపల్లికి చెందిన హనుమంత రాయప్ప పొలంలో మామిడి చెట్లను గుర్తితెలియని వ్యక్తులు నరికివేసి నట్లు ఫిర్యాదు అందిందన్నారు. గ్రామంలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోంటామని తెలిపారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:09 AM

Advertising
Advertising