ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DALIT AGITATION: డీసీఓను సస్పెండ్‌ చేయాలి

ABN, Publish Date - Aug 30 , 2024 | 12:05 AM

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియలో అవినీతికి పాల్పడిన డీసీఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని 200 మంది దళిత విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగారు.

Leaders of Dalit student unions protesting in front of the Collectorate

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు 29: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియలో అవినీతికి పాల్పడిన డీసీఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని 200 మంది దళిత విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థి సంఘాలనాయకుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్‌ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించగా వారిని అక్కడి నుంచి లాగేశారు. ఆల్‌ ఇండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధుప్రసాద్‌, ఎంఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెన్నె చిరంజీవి, వీసీకే రాష్ట్ర కార్యదర్శి మందల రమేష్‌ మాట్లాడుతూ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లలో జరిగిన అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముట్టడిలో బీఎ్‌సయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ, వెంకీ, రాజశేఖర్‌, రాళ్లపల్లి చంద్రశేఖర్‌, సాకే నరసింహులు, మారెన్న, బొమ్మన్న రాజు, మారుతి, రాజు, వివేక్‌, ఆనంద్‌, చైతన్య, రాము, రామాంజి, మద్దెలచెరువు సూరి, ప్రకాష్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:05 AM

Advertising
Advertising