PAVAN: డిప్యూటీ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:03 AM
రాష్ట్రంలో కూటమి విజయంలో కీలకభూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ చిత్రపటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో క్షీరాభిషేకం చేశారు. బుధవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎంగా పవనకళ్యాణ్ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక హనుమానకూడలిలో సంబరాలు చేసుకున్నారు.
పుట్టపర్తి రూరల్,జూన 19: రాష్ట్రంలో కూటమి విజయంలో కీలకభూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ చిత్రపటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో క్షీరాభిషేకం చేశారు. బుధవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎంగా పవనకళ్యాణ్ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక హనుమానకూడలిలో సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని, కూటమి ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు రామాంజనేయులు, బాలగంగాధర్, గంగిశెట్టి, దాసరి శంకర్, చింతాదామోదర్, దాసరి నాగభూషణం, శ్రీనివాసులు, పాపారెడ్డి, ఉక్కలం శ్రీనివాసులు, రాము, మారుతి, కూర్మనాయుడు పాల్గొన్నారు.
పవన చిత్రపటానికి క్షీరాభిషేకం
తనకల్లు, జూన 19: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం జనసేన పార్టీఅధినేత పవనకళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మండలంలోని కొక్కంటి క్రాస్ వద్ద పవనకళ్యాణ్ చిత్రపటాన్ని ఉంచి కేక్ కట్ చేసి, క్షీరాభిషేకం చేశారు. జనసేన నాయకుడు కె.వి.రమణ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారం చేపట్టడం హర్షించతగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ నాయకుడు సోంపాళ్యం నాగభూషణం, జనసేన కొట్టి అశ్వత్థకుమార్, ఎంపీటీసి అమర్ కార్తికేయ, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.
సినీమా ఆర్టు డైరెక్టర్ సాహీ సురేష్ హర్షం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవనకళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంపై సినిమా ఆర్ట్ డైరెక్టర్ సాహీ సురేష్ హర్షం వ్యక్తం తన వ్యవసాయ పొలం వద్ద పోస్టర్ అతికించారు.
బుక్కపట్నం: ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవనకళ్యాణ్ బుధవారం బాధ్య తలు స్వీకరించారు. ఈసందర్భంగా మండలకేంద్రంలోని తేరుకూడలిలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కూటమి అధికారంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు. నాయకులు దాసరి శ్రీనివాసులు, జంగం వెంకటరాముడు, సంజీవరాయుడు, ఈశ్వరప్ప, సతీ్‌షరాయల్, ఆకుల చంద్ర, మన్సూర్, గాజుల బాలాజీ పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2024 | 12:03 AM