వర్షపునీటిని తొలగించాలని ధర్నా
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:00 AM
మండల కేంద్రంలోని ఆర్డీటీ గ్రౌండు ముందు ప్రధాన రోడ్డుపై నిలిచిన వర్షపునీటిని తొలగించాలని సీపీఐ మండల నాయకులు మంగళవారం వినూత్న రీతిలో ధర్నా చేశారు.
ఆత్మకూరు, ఆగస్టు 20: మండల కేంద్రంలోని ఆర్డీటీ గ్రౌండు ముందు ప్రధాన రోడ్డుపై నిలిచిన వర్షపునీటిని తొలగించాలని సీపీఐ మండల నాయకులు మంగళవారం వినూత్న రీతిలో ధర్నా చేశారు. ఎన్నోఏళ్లుగా రోడ్డుపై మురుగు నీరు తొలగించాలని గ్రామ పంచాయతీ, ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. సమస్య పరిష్కరించేంత వరకు వర్షపు నీటిలో నిలబడి భీష్మించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన ఎనహెచఏఐ ఏఈ కుళ్లాయిరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనాయక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రామక్రిష్ణ, శివ, రామంజనేయులు, గోపాల్ నాయక్, నాగరాజు, తులసీ నాయక్, హనుమన్న, అశోక్ పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 12:00 AM