ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diarrhea : డయేరియా దడ

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:38 AM

జిల్లాలో అతిసార విజృంభిస్తోంది. వాంతులు, విరేచనాలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అపరిశుభ్రతే దీనికి ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమౌతోంది. పారిశుధ్య నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో పలువురు ఆస్పత్రులపాలవుతున్నారు. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం టౌనలో వంద మందికి పైగా అతిసార బాధితులు ఉన్నారు. కళ్యాణదుర్గం సీహెచసీలో రోజుకు సగటున పది మంది అతిసార చికిత్స ...

Victims receiving treatment at CHC

పెరుగుతున్న బాధితులు.. పారిశుధ్య లోపమే కారణం

కళ్యాణదుర్గం/రాయదుర్గం రూరల్‌, జూన 29: జిల్లాలో అతిసార విజృంభిస్తోంది. వాంతులు, విరేచనాలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అపరిశుభ్రతే దీనికి ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమౌతోంది. పారిశుధ్య నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో పలువురు ఆస్పత్రులపాలవుతున్నారు. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం టౌనలో వంద మందికి పైగా అతిసార బాధితులు ఉన్నారు. కళ్యాణదుర్గం సీహెచసీలో రోజుకు సగటున పది మంది అతిసార చికిత్స పొందుతున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో రోజూ సీహెచసీకి కేసులు వస్తున్నాయి. శీబావి, ముదిగల్లు, కంబదూరు, బ్రహ్మసముద్రం, దొడఘట్ట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు.


వారం రోజుల నుంచి..

వాంతులు, విరేచనాలతో వారం రోజుల నుంచి బాధపడుతున్నాను. ఓపిక ఉండడం లేదు. నీరసంగా ఉంది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. భయమేస్తోంది.

- వన్నూరమ్మ, శీబావి, కళ్యాణదుర్గం మండలం

మురుగునీటి వల్లే...

మా గ్రామంలో అపరిశుభ్రత వల్ల దోమలు, ఈగలు పెరిగిపోయాయి. వాటి వల్లే అతిసార ప్రబలింది. చాలా మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఓపిక అసలు ఉండడం లేదు. ఏమీ తినడానికి కావడం లేదు. చివరికి ఆసుపత్రిలో చేరాం.

- రామాంజనేయులు, శీబావి, కళ్యాణదుర్గం మండలం

నీరసంగా ఉంటోంది..

వారం రోజుల నుంచి వాంతులు, విరేచనాలు అధికం కావడంతో నీరసంగా ఉంటోంది. ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నాను. జ్వరం కూడా వస్తోంది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. దోమలు, ఈగలు మా గ్రామంలో విపరీతంగా పెరిగిపోయాయి. దీని వల్లే అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోంది.

- చందన, ముదిగల్లు, కళ్యాణదుర్గం మండలం


నాగిరెడ్డిపల్లిలో..

రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో వారం నుంచి అతిసార కేసులు పెరుగుతున్నాయి. సుమారు 20 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. ఎస్సీ, బీసీ కాలనీలకు చెందిన వన్నూరుస్వామి, సునీతమ్మ, ఇంద్రాక్షి, లక్ష్మి, గాలప్ప, సునీతమ్మ, బసవరాజు, బసన్న, సిద్ధలింగమ్మ, బసవరాజు, అనితమ్మ, ఆశవర్కర్‌ లక్ష్మి, దానమ్మ, షర్మిల, రాధమ్మతో పాటు మరికొంతమంది అతిసారతో బాధపడుతున్నారు. వీరిలో నలుగురు కణేకల్లు క్రాస్‌ వద్ద ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్ధలింగమ్మ, బసవరాజు బళ్లారిలో చికిత్స చేయించుకున్నారు. అనంతపురం ఆసుపత్రిలో అనితమ్మ అనే మహిళతో పాటు మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వారం నుంచి వైద్య సిబ్బంది గ్రామానికి వచ్చి చికిత్స చేసినా వ్యాధి తగ్గడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆవులదట్ల పీహెచసీ వైద్యులు రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

అనంతపురం టౌన: జిల్లాలో అతిసార కేసుల సమాచారం కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ గ్రామంలోనైనా వాంతులు, విరేచనాలతో ఎవరైనా బాధపడుతుంటే కంట్రోల్‌ రూం టోల్‌ఫ్రీ నంబరు 08554 277434కు ఫోన చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. కంట్రోల్‌రూమ్‌ 24గంటలూ అందుబాటులో ఉంటుందని అన్నారు.

జిల్లా ఆస్పత్రిలో తగ్గిన కేసులు

జిల్లా సర్వజన ఆస్పత్రిలో అతిసార కేసులు తగ్గాయి. ఆస్పత్రిలో శనివారం వరకూ 63 మంది అడ్మిషన అయి చికిత్స పొందారు. వీరిలో పలువురు కోలుకుని ఇళ్లకు వెళ్లారని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 51 మంది అతిసార బాధితులు చికిత్స పొందుతున్నారని అన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 30 , 2024 | 12:38 AM

Advertising
Advertising