COLLECTOR: ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు
ABN, Publish Date - Sep 02 , 2024 | 11:55 PM
ప్రజా ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతల ప్రజల నుంచి కలెక్టర్, డీఆర్వో రామకృష్ణారెడ్డి 384 అర్జీలు స్వీకరించారు.
అనంతపురం టౌన, సెప్టెంబరు 2: ప్రజా ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతల ప్రజల నుంచి కలెక్టర్, డీఆర్వో రామకృష్ణారెడ్డి 384 అర్జీలు స్వీకరించారు. భూసమస్యలపై వేదిక నుంచే కలెక్టర్ డివిజన, మండలస్థాయి అధికారులతో ఫోనలో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని, గ్రీవెన్సలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకుండా.. పరిష్కరించినట్లు మెసేజ్‌లు పెడుతున్నారని 108 ఉద్యోగులు సుంకన్న తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీఎంహెచఓను కలెక్టర్ ఆదేశించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బంది పడుతున్నామని రాఘవేంద్ర కాలేజ్ ఫార్మా-డి విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని బీసీ వెల్ఫేర్ డీడీనీ కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాఠశాలల విజిట్‌కు వెళ్లడం లేదని, పర్యవేక్షించాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో ముందు వరుసలో ఉన్న మండలాల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సత్కరించారు.
Updated Date - Sep 02 , 2024 | 11:55 PM