POLICE : గొడవలకు పాల్పడొద్దు: ఎస్‌ఐ
ABN, Publish Date - May 31 , 2024 | 12:25 AM
గ్రామాల్లో గొడవలు, ఘర్ష ణలకు పాల్పడ కుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్‌ఐ వీ రేష్ తెలిపారు. మండ లంలోని మధుడి గ్రామం లో గురువారం ఆయన ఎస్సీ కాలనీలో పర్యటించి వారితో మాట్లాడారు. జూన 4న ఎన్నికల కౌంటింగ్ జరు గుతున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పార్టీల గొడవలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు.
అగళి, మే 30 : గ్రామాల్లో గొడవలు, ఘర్ష ణలకు పాల్పడ కుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్‌ఐ వీ రేష్ తెలిపారు. మండ లంలోని మధుడి గ్రామం లో గురువారం ఆయన ఎస్సీ కాలనీలో పర్యటించి వారితో మాట్లాడారు. జూన 4న ఎన్నికల కౌంటింగ్ జరు గుతున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పార్టీల గొడవలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. గొడవలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
మడకశిరటౌన: ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ జనార్దననాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వ త్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన 4న నిర్వహిస్తున్న నేపథ్యంలో అమరాపురం మండల వ్యాప్తంగా 144 సెక్షన, 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటాయన్నారు. ఓ ట్ల లెక్కింపు సందర్భంగా రోడ్లపైకి వచ్చి టపాకాయలు కాల్చినా, మోటారు సైకిల్ సైలెన్సర్ తీసివేసి నడిపినా, ర్యాలీలు చేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నియమావళిని ఎవ్వరూ ఉల్లంఘించవద్దని కోరారు.
రొళ్ల: మండలంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన, 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటాయని ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. ర్యాలీలు, టపాసులు కాల్చడం వంటివి చేయకూడదని తెలిపారు. సోషియల్ మీడియాలో ద్వేషపూరిత, అవమానకర, నేరప్రేరిత సమాచారం, సందేశం వంటి పోస్టులు పెట్టకుండా అడ్మిన్లు చూసుకోవాలని సూచించారు. ప్రజలు దీనిని గమనించాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 31 , 2024 | 12:25 AM