ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DSP inquiry టీడీపీ, వైసీపీ వర్గీయుల గొడవపై డీఎస్పీ విచారణ

ABN, Publish Date - Jul 27 , 2024 | 12:23 AM

మండలంలోని పుప్పాల గ్రామంలో గత గురువారం రాత్రి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన గొడవపై తాడిపత్రి డీఎస్పీ జనార్దననాయుడు శుక్రవారం విచారణ చేపట్టారు.

యాడికి, జూలై26: మండలంలోని పుప్పాల గ్రామంలో గత గురువారం రాత్రి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన గొడవపై తాడిపత్రి డీఎస్పీ జనార్దననాయుడు శుక్రవారం విచారణ చేపట్టారు.


పుప్పాల గ్రామానికి వచ్చిన ఆయన గొడవపై ఇరువర్గీయులను, గ్రామస్థులను ఆరా తీశారు. గాయపడిన వారి వివరాలు తెలుసుకున్నారు. గొడవలను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని ఆదేశించారు. ఆయన వెంట సీఐ నాగార్జునరెడ్డి ఉన్నారు.

ఇరువర్గాలకు చెందిన 18మందిపై కేసు నమోదు

పుప్పాలలో జరిగిన గొడవకు సంబంధించి టీడీపీకి చెందిన ఎనిమిది మందిపై, వైసీపీకి చెందిన 10మందిపై కేసు నమోదుచేసినట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. టీడీపీకి చెందిన చెంచు రాజు ఇచ్చిన ఫిర్యాదుమేరకు వైసీపీ వర్గీయులు సుధాకర్‌, మురళీ, సుదర్శన, రామాంజనేయులు, దేవేంద్ర, ఈశ్వర్‌రెడ్డి, చిన్నవీరయ్య, గంగరాజు, అశోక్‌, రంగస్వామినాయక్‌లపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. వైసీపీకి చెందిన సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ వర్గీయులు దేవేంద్ర, సుంకిరెడ్డి, శివ, చరణ్‌, తేజ, ప్రభాకర్‌, సురేష్‌, మహేష్‌లపై కేసు నమోదుచేసినట్లు సీఐ చెప్పారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 27 , 2024 | 12:23 AM

Advertising
Advertising
<