DWAKRA: డ్వాక్రా మహిళల అభివృద్ధికి ప్రణాళిక
ABN, Publish Date - Nov 05 , 2024 | 12:12 AM
డ్వాక్రా సంఘాల అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికతో ముందుకు సాగాలని డీఆర్‌డీఏ-వెలుగు పీడీ ఈశ్వరయ్య సూచించారు. డీఆర్‌డీఏ-వెలుగు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సోమవారం సమీక్ష నిర్వహించారు.
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు4(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికతో ముందుకు సాగాలని డీఆర్‌డీఏ-వెలుగు పీడీ ఈశ్వరయ్య సూచించారు. డీఆర్‌డీఏ-వెలుగు కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సోమవారం సమీక్ష నిర్వహించారు. జీవనోపాధుల పెంపునకు ఓఎనడీసీ కింద జిల్లాకు 1319 యూనిట్లు టార్గెట్ ఇచ్చారని, ఇప్పటి వరకు 400 యూనిట్లను గుర్తించామని తెలిపారు. మిగిలినవి నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. ఉన్నతి కింద ఎస్టీ మహిళలకు 869 పెరటికోళ్ల పెంపకం యూనిట్లు కేటాయించారని, ఇప్పటి వరకు 763 యూనిట్లు గుర్తించామని తెలిపారు. రూ.6 వేల యూనిట్‌కు రూ.3,600 సబ్సిడీతో ట్రైకార్ నుంచి రూ.45.78 లక్షలు నిధులు కేటాయించారని తెలిపారు. ఉన్నతికింద ఎస్టీ మహిళలకు రూ.3 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.12 కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల గ్రేడింగ్ శాతాన్ని పెంచాలని, అట్టడుగు సంఘాలను బలోపేతం చేయడానికి అన్ని విభాగాల్లో పురోగతి సాధించాలని సూచించారు. వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసి, డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీఏ-వెలుగు అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. సమీక్షలో డీపీఎంలు గంగాధర్, రవీంద్రబాబు, ఏపీఎంలు అనిత, మద్దిలేటి, మంజుళ, స్త్రీనిధి మేనేజర్ హనుమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 12:12 AM