GOD : కన్నులపండువగా ఏడుకొండల స్వామి వ్రతం
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:45 PM
పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాల యంలో శనివారం ఉదయం నుంచి శ్రావణమాసం పురస్కరించుకొని ఏడు కొండల స్వామి వ్రతాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య వైభవంగా సాగింది. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉద యం 6 గంటల నుంచి గణపతి పూజ, గంగపూజ, గోపూజా తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
మడకశిరటౌన, ఆగస్టు 24 : పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాల యంలో శనివారం ఉదయం నుంచి శ్రావణమాసం పురస్కరించుకొని ఏడు కొండల స్వామి వ్రతాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య వైభవంగా సాగింది. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉద యం 6 గంటల నుంచి గణపతి పూజ, గంగపూజ, గోపూజా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 10.30 గంటలకు ఏడు శనివారాల వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట కు అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు ఏడు కొండల స్వామి వ్రతంలో పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 24 , 2024 | 11:46 PM