ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections:కోడ్‌ ఉల్లంఘనలపై కొరడా

ABN, Publish Date - Apr 22 , 2024 | 12:47 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అధికార యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 109 మందిపై కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు వేటు వేశారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వలంటీర్లు, డీలర్లు, రేషన సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, రెగ్యులర్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ విడుదల చేసిన బులెటిన ప్రకారం అత్యధికంగా రాయదుర్గం నియోజకవర్గంలోనే 29 మందిపై ఉల్లంఘనల కింద వేటు వేసారు.

109 మందిపై వేటు

రాయదుర్గంలో అత్యధికం- కళ్యాణదుర్గంలో జీరో

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 21: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అధికార యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 109 మందిపై కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు వేటు వేశారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వలంటీర్లు, డీలర్లు, రేషన సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, రెగ్యులర్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ విడుదల చేసిన బులెటిన ప్రకారం అత్యధికంగా రాయదుర్గం నియోజకవర్గంలోనే 29 మందిపై ఉల్లంఘనల కింద వేటు వేసారు. ఇందులో వలంటీర్లు 23 మంది ఉండగా డీలర్లు నలుగురు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇద్దరు ఉన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 19 మందిపై వేటు పడగా వీరిలో వలంటీర్లు 14 మంది, డీలర్లు ఇద్దరు, కాంట్రాక్‌ ఉద్యోగులు ముగ్గురు చర్యలకు గురయ్యారు. గుంతకల్లు నియోజకవర్గంలో వలంటీర్లు ఆరుగురు, డీలర్లు ఇద్దరు చొప్పున 8 మందిపై వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గంలో 24మందిపై కోడ్‌ ఉల్లఘించినందులకు వేటు వేశారు.


ఇందులో 11మంది వలంటీర్లు, 11మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. శింగనమల నియోజకవర్గంలో 19మందిపై చర్యలు తీసుకోగా ఇందులో 10మంది వలంటీర్లు, ఇద్దరు డీలర్లు, ఐదుగురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఇద్దరు రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. అనంతపురం అర్బన నియోజకవర్గంలో ఇప్పటికి నలుగురిపై మాత్రమే చర్యలు తీసుకోగా వారిలో ముగ్గురు వలంటీర్లు ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఆరుగురిపై వేటుపడగా వీరిలో వలంటీర్లు ముగ్గురు, డీలర్‌ ఒకరు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇద్దరు ఉన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోడ్‌ ఉల్లంఘనలపై ఒక్కరిపై కూడా చర్యలు లేకపోవడం విశేషం.

సీ విజిల్‌యా్‌పకు 419 ఫిర్యాదులు.. రూ 2,95,14,352 సీజ్‌

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నిబంధనల ఉల్లంఘనలపై ఆనలైనలో ఫిర్యాదు చేయడానికి ఎన్నికల కమిషన సీ విజిల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌కు అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 419 ఫిర్యాదులు అందాయి.


ఇందులో జిల్లా కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు 159 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో రాయదుర్గం నుంచి 39, ఉరవకొండ నుంచి 25, గుంతకల్లు నుంచి 37, తాడిపత్రి నుంచి 40, శింగనమల నుంచి 3, అనంతపురంఅర్బన నుంచి 43, కళ్యాణదుర్గం నుంచి 50, రాప్తాడు నుంచి 23 చొప్పున సీ విజిల్‌ యాప్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ నిబంధనల మేరకు ఒక వ్యక్తి వద్ద రూ. 50వేలు వరకు మాత్రమే నగదు ఉండవచ్చు. అంతకన్నా ఎక్కువ నగదు తీసుకెళితే సీజ్‌ చేస్తారు. ఈ నిబంధనల మేరకు ఇప్పటి వరకు జిల్లాలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో రూ. 2,9514,352 నగదును సీజ్‌ చేశారు. ఆ డబ్బుకు ఆధారాలు చూపితే వెనక్కు ఇస్తారు.


మరిన్ని చదవండి

Updated Date - Apr 22 , 2024 | 12:47 AM

Advertising
Advertising