METER READERS: మీటర్ రీడర్లకు ఉపాధి గండం..!
ABN, Publish Date - Oct 19 , 2024 | 11:47 PM
స్మార్ట్ మీటర్ల రాకతో రీడర్ల బతుకు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్నారు.
స్మార్ట్ మీటర్ల రాకతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన
కదిరి అర్బన, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్ల రాకతో రీడర్ల బతుకు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్నారు. రెండుదశాబ్దాలుగా విద్యుత సంస్థలో పనిచేస్తున్నవారు, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క విద్యుత స్మార్టుమీటర్లు తీసుకొస్తున్న సందర్భంల ఉపాధి కొల్పోయే ప్రమాదం ఏర్పడిందని రీడర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఏర్పడే సర్కిల్ రీడర్లకు అర్హతలనుబట్టి షిఫ్ట్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచమెన్లు, డ్రైవర్లు, గ్యాంగ్‌మెన్లుగా ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈమేరకు ఎపీ మీటర్ రీడింగ్ యూనియన ఆధ్వర్యంలో ఇటీవల ఎస్‌ఈ సురేంద్రకు విన్నవించారు.
కదిరి పరిధిలో 50 మంది మీటర్ రీడర్లు: కదిరి పరిధిలో 50మంది వరకు మీటర్ల రీడర్లు పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీ వరకు విద్యుత మీటర్ రీడింగ్ తీస్తుంటారు. ఒక మీటర్ రీడింగ్ తీసినందుకు విద్యుత శాఖ సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.6 నుంచి రూ.7 చెల్లిస్తుంది. మిషన చార్జీలు, ఫోన రీచార్జి, రోల్స్, మరమ్మతులు ఈఎ్‌సఐ, ఈపీఎఫ్ కటింగ్‌లు పోను రీడర్ చేతికి వచ్చేది కేవలం రూ.3.50 మాత్రమే. సగటున ఒక్కొక్క మీటర్ రీడర్ మూడువేలనుంచి 3,500 మీటర్లకు రీడింగ్ తీసే అవకాశముంది. దీంతో వీరికి నెలకు రూ.పదివేల వరకు ఆదాయం సమకూరుతుంది.
అర్హతలను బట్టీ ఉద్యోగం ఇవ్వాలి
ఎంతోకాలంగా విద్యుత మీటర్ రీడర్‌గా పనిచేస్తున్నా. విద్యార్హతను బట్టి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి. షిఫ్టు ఆపరేటర్లు, అటెండర్లు, వాచమెన్లు, డ్రైవర్లు, గ్యాంగ్‌మెన్లుగా ఉపాధి కల్పించి ఆదుకోవాలి. మాలోనూ విద్యార్హతలు ఎక్కువగా ఉన్నారు. అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
- రాఘవ, విద్యుత మీటర్ రీడర్
చాలీచాలని వేతనంతో నెట్టుకొస్తున్నాం
ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతపంతో కుటుంబ జీవనం సాగిస్తున్నా. నెలకు రూ.పదివేలకు మించి ఆదాయం రాదు. ప్రభుత్వం మాపట్ల సానూకూల నిర్ణయం తీసువాలి. తమకు ఈపని తప్ప మరోపని రాదు. తమకు ఉద్యోగభద్రత కల్పించి ఆదుకోవాలి.
- జమీర్, విద్యుత మీటర్ రీడర్
ఉద్యోగ భద్రత కల్పించాలి
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న విద్యుత మీటర్ రీడర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి. రెండు దశాబ్దాలకుపైగా పనిచేసేవారు చాలా మంది ఉన్నారు. వీరంతా మీటర్‌కు కొంత రేటు చొప్పున వేతనం పొందుతున్నారు. ఇంతకాలంగా పనిచేస్తున్నా నేటికీ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిగానే పనిచేస్తున్నారు. సీనియార్టీ, అర్హతలను బట్టీ విద్యుత శాఖలో ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం ఇవ్వాలి. చిరుద్యోగులపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.
- జీఎల్ నరసింహులు, సీఐటీయూ
Updated Date - Oct 19 , 2024 | 11:47 PM