ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

COLLECTOR : కేసులున్నా.. ఏజెంట్‌గా ఉండొచ్చు..!

ABN, Publish Date - May 12 , 2024 | 12:28 AM

పోలీసు కేసులున్నా పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. పోలింగ్‌ పక్రియలో రాజకీయపార్టీలు, అభ్యర్థులకు ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమని అన్నారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు పోలింగ్‌ ఏజెంటుగా కూర్చొనే వ్యక్తికి ఆ పోలింగ్‌ కేంద్రంలో ఓటరుగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు....

Collector Vinod Kumar is revealing the details

పోలీసు కేసులున్నా పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. పోలింగ్‌ పక్రియలో రాజకీయపార్టీలు, అభ్యర్థులకు ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమని అన్నారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు పోలింగ్‌ ఏజెంటుగా కూర్చొనే వ్యక్తికి ఆ పోలింగ్‌ కేంద్రంలో ఓటరుగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. చుట్టుపక్కల పోలింగ్‌ కేంద్రాల్లోగాని, అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైనాగాని ఓటరుగా ఉంటే ఏజెంటుగా కూర్చోవచ్చని అన్నారు. ఇతర నియోజకవర్గాల వారు శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు ఉన్న నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారు. ఏజెంట్ల వివరాలను రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు సంతకం చేసి ఆర్వోలకు ఇవ్వాలని, అక్కడి నుంచి పీఓలకు పంపుతారని తెలిపారు. ఆ తర్వాత అభ్యర్థి, ఏజెంటు కాలమ్‌ 10లో పోలింగ్‌ ఏజెంట్‌ వివరాలన్నీ నమోదు చేసి పంపించాలని, ఏజెంట్‌ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా సిగ్నేచర్‌ మ్యాచ అవుతుందో లేదో చూసుకుని.. పీఓ లోపలికి అనుమతిస్తారని అన్నారు. ఏజెంట్ల విషయంలో సందేహాలు ఉంటే నియోజకవర్గాల ఆర్వోలను సంప్రదించవచ్చని సూచించారు. - అనంతపురం టౌన


మేం రెడీ.. మీరు రెడీనా..?

పోలింగ్‌ నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని.. ఓటర్లు తమ హక్కును సంతోషంగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. 13వ తేదీ పోలింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన సౌకార్యలు కల్పిస్తున్నామని అన్నారు. ఓటర్ల కోసం ఎన్నికల కమిషన 21 యాప్‌లు అందుబాటులో ఉంచిందని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఈఆర్వో నెట్‌యా్‌పలో ఓటరు జాబితా సమాచారం మొత్తం దొరుకుతుందని, ఎన్కోర్‌ యాప్‌లో పోలింగ్‌ మొదలు కౌంటింగ్‌ వరకు సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. ఓటరు హెల్ప్‌లైన యాప్‌లో ఓటర్లు తమ రిజిస్టర్‌ పోలింగ్‌ కేంద్రాలను తెలుసుకోవచ్చని అన్నారు. పోలింగ్‌ రోజున పర్యవేక్షణ కోసం ఆర్వో కార్యాలయంటో మీడియా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటరు హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేస్తున్నామని, రంగోళితో ఓటర్లకు ఆహ్వానం పలుకుతామని తెలిపారు. ఓటు వేయడం హక్కు కాదని, బాధ్యత అని తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.

- అనంతపురం టౌన


అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 12 , 2024 | 12:29 AM

Advertising
Advertising