FARMERS FIRE : వంతెన పనులను అడ్డుకున్న రైతులు
ABN, Publish Date - Jul 22 , 2024 | 11:34 PM
మండలకేంద్రమైన రొద్దం సమీపంలో పెన్నానదిలో నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. తమ భూములు కోతలకు గురవుతాయని వంతెన నిర్మాణం ఎత్తు పెంచాలని నది చుట్టుపక్కల పొలాలున్న రైతులు డిమాం డ్ చేశారు. రొద్దం సమీపంలో పెన్నానది ప్రవహించడంతో కొన్నేళ్లుగా రొద్దం నుంచి కుర్లపల్లి, కనుమర, నారనాగేపల్లి గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
అధికారుల హామీతో సద్దుమణిగిన వివాదం
పెనుకొండ రూరల్, జూలై 22: మండలకేంద్రమైన రొద్దం సమీపంలో పెన్నానదిలో నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. తమ భూములు కోతలకు గురవుతాయని వంతెన నిర్మాణం ఎత్తు పెంచాలని నది చుట్టుపక్కల పొలాలున్న రైతులు డిమాం డ్ చేశారు. రొద్దం సమీపంలో పెన్నానది ప్రవహించడంతో కొన్నేళ్లుగా రొద్దం నుంచి కుర్లపల్లి, కనుమర, నారనాగేపల్లి గ్రామాలకు
రాకపోకలు సాగించేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బీకే పార్థసారథి చొరవతో రూ.1.80కోట్లతో వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. మొత్తం 180 మీటర్ల వంతెనలో 120 మీటర్ల వరకు పూర్తయింది. నదిలో మిగిలిన 60 మీరటర్ల వంతెన పనులను పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వ ర్యంలో చేపడుతున్నారు. అయితే పెన్నానది చుట్టుపక్కల ఉన్న రైతులు తమ పొలాలు కోతకు గురవుతాయని, వంతెన నిర్మాణం ఎత్తు పెంచాలని సోమవారం పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పంచా యతీరాజ్ ఈఈ మురళి ఘటన స్థలానికి చేరుకుని భూమి కోతలు కోయ కుండా భూముల చుట్టూ సేఫ్టీవాల్ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో రైతు లు శాంతించారు. అనంతరం యథావిధిగా వంతెన పనులు చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 22 , 2024 | 11:34 PM