Tungabhadra Dam : తుంగభద్రకు వేగంగా..
ABN, Publish Date - Jul 07 , 2024 | 11:52 PM
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజులుగా తుంగభద్రకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఒక్క రోజే ఐదు టీఎంసీలు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరుకుంది. గత శుక్రవారం 19,201 క్యూసెక్కులు, శనివారం 25,556 క్యూసెక్కులుగా ఉన్న ఇనఫ్లో ఆదివారం ఉదయానికి 50,175 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో
జలాశయానికి ఒకేరోజు ఐదు టీఎంసీల నీరు
18.249 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
బొమ్మనహాళ్, జూలై 7: తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజులుగా తుంగభద్రకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఒక్క రోజే ఐదు టీఎంసీలు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరుకుంది. గత శుక్రవారం 19,201 క్యూసెక్కులు, శనివారం 25,556 క్యూసెక్కులుగా ఉన్న ఇనఫ్లో ఆదివారం ఉదయానికి 50,175 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో
105.788 టీఎంసీల పూర్తి మట్టానికి గాను 18.249 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ఔట్ ఫ్లో 263 క్యూసెక్కులుగా ఉంది. జలాశయానికి ఎగువన ఉన్న శివమొగ్గ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యాంలోకి వరదప్రవాహం పెరుగు తుండటం పట్ల బొమ్మనహాళ్, కణేకల్లు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి జలాశయానికి ముందు గానే వరదనీరు వచ్చి చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి డ్యామ్‌లో 3.081 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. 302 క్యూసెక్కుల ఇనఫ్లో, 249 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండేదని బోర్డు అధికారులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jul 07 , 2024 | 11:52 PM