GUMMANURU: వైవీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది
ABN, Publish Date - May 06 , 2024 | 11:32 PM
ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డికి ఓటమి భయం పట్టుకుందంటూ మాజీ మంత్రి, గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే వైవీఆర్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మండలంలోని ఖాదర్‌పేట, అనుంపల్లి, కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, రామగిరి ఎగువ, దిగువతండాలు, రామగిరిలో సోమవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు
పామిడి, మే 6: ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డికి ఓటమి భయం పట్టుకుందంటూ మాజీ మంత్రి, గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే వైవీఆర్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మండలంలోని ఖాదర్‌పేట, అనుంపల్లి, కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, రామగిరి ఎగువ, దిగువతండాలు, రామగిరిలో సోమవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నాకు అన్ని కులాలు సమానమేనన్నారు. నేను మీ ఇంటికి వస్తే మీ పక్కనే కుర్చుంటానన్నారు. ఎమ్మెల్యే వైవీఆర్ మిమ్మల్ని పక్కన కుర్చీలో కూడా కూర్చోనియ్యడని సెటైర్లు వేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కూటమిలో ఉండడం వల్ల ఎన్నో సంస్థలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వల్లనే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని చెరువులకు నీరు తెప్పించేదుకు కృషి చేస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుని మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తామన్నారు. రాష్ట్రం దాదాపు ఇరవై ఏళ్లు వెనక్కు పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ సూపర్ సిక్స్ పథకాలు అందుతాయన్నారు. గుంతకల్లు అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ రెండు స్థానాలలోనూ టీడీపీ విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు.
టీడీపీతోనే గిరిజనుల అభివృద్ధి: తెలుగుదేశం పార్టీతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతారని గుమ్మనూరు జయరాం, జిల్లా అధ్యక్షులు వెంకటశివుడుయాదవ్ అన్నారు. మండలంలోని రామగిరి ఎగువతండా గ్రామంలో సోమవారం సాయంత్రం గిరిజన అభివృద్ధి కోసం కర పత్రాలను విడుదల చేశారు.
గుంతకల్లు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఎమ్మెల్యే అభ్యర్ఝి గుమ్మనూరు జయరాంను, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణను గెలిపించాలంటూ గుమ్మనూరు నారాయణ స్వామి ఓటర్లను కోరారు. పట్టణంలోని రైల్వే డీజల్ షెడ్‌లోనూ, 31వ వార్డులోనూ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీచేసి ప్రచారం చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్, నాయకులు తలారి మస్తానప్ప పాల్గొన్నారు. మండలంలోని కదిరిపల్లి, ఇమాంపురం గ్రామాల్లో గుమ్మనూరు శ్రీనివాసులు ప్రచారం చేశారు.
గుత్తి: పట్టణంలో గుత్తి, గుత్తిఆర్‌ఎ్‌సలో గుమ్మనూరు జయరాంను గెలపించాలని గుమ్మనూరు నారాయణ, ఆయన సతీమణి కమలమ్మతో పాటు కుటుంబ సభ్యులు సోమవారం ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలోని బండగేరిలో కమలమ్మ, టీడీపీ నాయకులతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుత్తి, గుత్తి ఆర్‌ఎస్ పట్టణాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గుత్తి ఆర్‌ఎ్‌సలోని 6వ వార్డులో 30కుటుంబాలు టీడీపీలో చేరారు. గుమ్మనూరు నారాయణ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సోమశేఖర్, రాము, ఎంకే చౌదరి, నారాయణస్వామి, వెంకటేష్, అబ్దుల్‌వహబ్ పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2024 | 11:32 PM