GOD : కంబాలరాయుడికి జ్యోతుల ఉత్సవం
ABN, Publish Date - Aug 20 , 2024 | 12:18 AM
మండలంలోని జిల్లేడగుంట గ్రామంలో వెలసిన కంబాల సనసింహస్వామికి గ్రామస్థులు సోమవా రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వా రికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రఽథంపై ఉంచి జిల్లేడగుంట, భక్తరహళ్లి గ్రామాల్లో ఉరేగిం చారు. స్వామివారి రథంతో పాటు భక్తులు జ్యోతులను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్లూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
మడకశిర రూరల్, ఆగస్టు 19 : మండలంలోని జిల్లేడగుంట గ్రామంలో వెలసిన కంబాల సనసింహస్వామికి గ్రామస్థులు సోమవా రం జ్యోతుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వా రికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రఽథంపై ఉంచి జిల్లేడగుంట, భక్తరహళ్లి గ్రామాల్లో ఉరేగిం చారు. స్వామివారి రథంతో పాటు భక్తులు జ్యోతులను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్లూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవ త్సరం శ్రావణమాసంలో అంతా కంబాల నరసింహస్వామికి జ్యో తులు మోసి మొక్కులు తీర్చుకుంటామని గ్రామస్థులు తెలిపారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పూజలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆలయాల్లో శ్రావణమాస పూజలు
మడకశిరటౌన: శ్రావణ సోమవారం పురస్కరించుకొని మడకశిర పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలను కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ సమీపంలోని మిట్టబండ ఆంజనేయస్వామి ఆల యంలో స్వామికి ఆకుపూజ చేశారు. అలాగే పెద్దఎత్తున భక్తులు కాలిన డకన కావలికొండను ఎక్కి ఆంజనేయస్వామికి విశేష పూజలు చేసి,
మొ క్కులను తీర్చుకున్నారు. అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామివా రికి కుంకుమార్చన తదితర పూజల చేశారు. వెంకటేశ్వరస్వామి ఆలయం లో ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
హిందూపురం అర్బన: పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో వెలసిన ఎల్లమ్మదేవత ఆలయంలో శ్రావణమాసం పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే వివిధ అభిషేకాలు, అర్చనలు చేశారు. ఎల్లమ్మ మూల విరాట్‌కు, శివలింగానికి, బసవేశ్వరుడికి పంచామృతాభిషేకం చేశారు. ఎల్లమ్మ దేవతను వెండి కిరీటంతో అలంకరించారు.
పెనుకొండ: శ్రావణ మాసం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 20 , 2024 | 12:18 AM