ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KALAVA CAMPAIN: ఇంటింటికీ ఉచిత కొళాయి కనెక్షన

ABN, Publish Date - May 07 , 2024 | 11:42 PM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఉచిత తాగునీటి కనెక్షన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం డీ.హీరేహాళ్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర ్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను అందించి ఓటు వేయాలని కోరారు.

ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న కాలవ

కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు

డీ.హీరేహాళ్‌, మే 7: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఉచిత తాగునీటి కనెక్షన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం డీ.హీరేహాళ్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర ్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను అందించి ఓటు వేయాలని కోరారు. తొలుత గ్రామంలో ఉన్న దేవమ్మ, సుంకులమ్మ ఆలయాల్లో ఆయన కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు భారీ గజమాలతో కాలవ శ్రీనివాసులుకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లుగా చేసిన నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. జగనను రాష్ట్రం నుంచి తరిమికొట్టి మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవడం కోసం ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకగా ఉందన్నారు. గత టీడీపీ హయాంలో రాయదుర్గం నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. తనను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.


70 కుటుంబాలు టీడీపీలోకి చేరిక

డీ.హీరేహాళ్‌కు చెందిన 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గవిసిద్ధ, మారెన్న, వన్నూరుస్వామి, అనిల్‌, రంగలతో మరికొందరు చేరిన వారికి కాలవ శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బొమ్మనహాళ్‌లో 50 కుటుంబాలు...

నేమకల్లు గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ నుండి కాలవ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలోకి చేరారు. టీడీపీ నాయకులు గాలి బసప్ప, శివప్ప, హనుమంతప్ప, దొణెప్ప, తిప్పేస్వామిల ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. కాలవ శ్రీనివాసులు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన బొమ్మలాట శివమ్మ, రామాంజనమ్మ, రామాంజనేయులు, ప్రకాష్‌, రేవన్న, హనుమంతరాయ, నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మెచ్చుకొని టీడీపీలో చేరామన్నారు.


కుటుంబీకుల ప్రచారం

కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత మంగళవారం బొమ్మనహాళ్‌ మండలంలోని ఏళంజి, కొత్తూరు, కానాపురం, దేవగిరిక్రాస్‌, గోనేహాళ్‌ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే విధంగా కాలవ శ్రీనివాసులు సతీమణి విజయలక్ష్మి డీ.హీరేహాళ్‌లో పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే కూతురు కాలవ గౌతమి కణేకల్లు మండలంలోని నల్లంపల్లి, సొల్లాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 07 , 2024 | 11:42 PM

Advertising
Advertising