Arrest: గంజాయి విక్రేతల అరెస్ట్
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:12 AM
మండలంలోని గుమ్మయ్యగారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 2.8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషనలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు.
గోరంట్ల, ఆగస్టు 20: మండలంలోని గుమ్మయ్యగారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 2.8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషనలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. గోరంట్లలోని రాజీవ్‌కాలనీకి చెందిన షేక్‌అఫ్రోజ్, జామియామసీదు ప్రాంతంలో ఉంటున్న షేక్ మహమ్మద్, మహమ్మద్‌రిజ్వాన, మహమ్మద్‌ఇమ్రానలు గంజాయికి అలవాటు పడ్డారు. ఈక్రమంలో వారు తెచ్చుకోవడంతో పాటు ఇతరులకు విక్రయించేవారు. ఈక్రమంలో దీన్నే వృత్తిగా చేసుకుని మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అందిన సమాచారం మేరకు గోరంట్ల సీఐ శేఖర్ తన సిబ్బందితో గుమ్మయ్యగారిపల్లి కూడలిలో దాడిచేసి పైనలుగురిని పట్టుకోగా మిగిలిన వారు పారిపోయారన్నారు. వీరంతా 30ఏళ్ల లోపు యువకులని, ముగ్గురు మెకానిక్‌లుకాగా, ఒకరు వెల్డింగ్ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు కదిరి ప్రాంతంనుంచి గంజాయిని తెస్తున్నారని, చిత్తూరు జిల్లా వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నారని, వారందరిని వారం పదిరోజుల్లో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ శేఖర్, పోలీసులు వెంకటేష్, వసంత, రామానాయక్, రెడ్డిబాషా తదితరులున్నారు.
Updated Date - Aug 21 , 2024 | 12:12 AM