ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gates collage ఇన్ఫోసిస్‌ ట్రైౖనింగ్‌ పార్ట్‌నర్‌గా గేట్స్‌

ABN, Publish Date - Jul 10 , 2024 | 12:31 AM

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌గా గేట్స్‌ కళాశాల ఎంపికైందని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందని ఆ కళాశాల కరెస్పాండెంట్‌ వీకే పద్మావతమ్మ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

గుత్తి, జూలై9: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌గా గేట్స్‌ కళాశాల ఎంపికైందని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందని ఆ కళాశాల కరెస్పాండెంట్‌ వీకే పద్మావతమ్మ మంగళవారం ప్రకటనలో తెలిపారు.


ఈ ఒప్పందం ద్వారా కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ ట్రైనర్లు వెబ్‌ డెవల్‌పమెంట్‌ టెక్నాలజీపై శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ సంస్థలో ఉద్యోగావకాశాలతో పాటు నగదు బహుమతులను అందజేస్తారన్నారు. కళాశాల ఎండీ రఘునాథరెడ్డి ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని ఐసీటీ అకాడమీ రీజనల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ ద్వారా అందుకున్నారన్నారు. ఈ సంస్థ రామలసీమలో కేవలం నాలుగు కళాశాలలను తమ ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌గా ఎన్నుకుందని చెప్పారు. అందులో గేట్స్‌ కళాశాల ఉండటం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ శ్రీవాణి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సూరయ్య, ఏఓ ఇంతియాజ్‌బాషా, ప్లేస్‌మెంట్‌ అధికారి తన్వీర్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 10 , 2024 | 12:31 AM

Advertising
Advertising
<