ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GIRIJA KALYANAM: కనులపండువగా గిరిజా కల్యాణం

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:56 PM

రామకృష్ణ సేవాసమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం మూడవరోడ్డులోని జీఆర్‌ ఫంక్షన హాల్‌లో సాయిట్రస్టు ఆధ్వర్యంలో గిరిజా కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. రామకృష్ణ సేవాసమితి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 27 నుంచి నిర్వహిస్తున్న వేడుకలు బుధవారం ముగిశాయి.

Vedic Brahmins administering Girija Kalyana

అనంతపురం కల్చరల్‌, జూలై 31: రామకృష్ణ సేవాసమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం మూడవరోడ్డులోని జీఆర్‌ ఫంక్షన హాల్‌లో సాయిట్రస్టు ఆధ్వర్యంలో గిరిజా కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. రామకృష్ణ సేవాసమితి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 27 నుంచి నిర్వహిస్తున్న వేడుకలు బుధవారం ముగిశాయి. ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1గంట వరకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ పర్యవేక్షణలో శ్రీశైలం, అలంపూర్‌ శక్తిపీఠాలనుంచి రుగ్వేదం పఠిస్తూ తీసుకువచ్చిన ద్వాదశ లింగాలకు రుత్వికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ముత్తైదువలు తమ ఇళ్ల నుంచి తీసుకువచ్చిన సారె, ఒడిబియ్యంను అమ్మవారికి సమర్పించారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం శ్రీనృత్యకళానిలయం నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి బృందం శివపదంకు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అనంతరం సామవేదం శణ్ముఖశర్మ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్‌, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీకృష్ణశశి, కార్యదర్శి ప్రవీణ్‌, సహాయ కార్యదర్శి శ్రీధరమూర్తి, వేణుగోపాల్‌, సంధ్యామూర్తి, శ్రీనిధి రఘు, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్‌, శ్రీవల్లి పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:56 PM

Advertising
Advertising
<