GOD : ఘనంగా సీతారాముల కల్యాణం
ABN, Publish Date - Apr 23 , 2024 | 11:49 PM
శ్రీరామనవ మి వేడుకల్లో భాగంగా స్థానిక బోయ పాళ్యంలోని రామభద్రాలయంలో సీతారామ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీని వాసులు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం కోలాటం, చక్కభజన, తదితర సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేద పండితులు పంచాంగం శేషప్ప స్వామి, ఆదినారాయణ మూర్తి సీతారామ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
పెనుకొండ, ఏప్రిల్ 23 : శ్రీరామనవ మి వేడుకల్లో భాగంగా స్థానిక బోయ పాళ్యంలోని రామభద్రాలయంలో సీతారామ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీని వాసులు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం కోలాటం, చక్కభజన, తదితర సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేద పండితులు పంచాంగం శేషప్ప స్వామి, ఆదినారాయణ మూర్తి సీతారామ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించారు.
నిడిమామిడమ్మ ఉత్సవాలు
మడకశిర రూరల్: మండలంలో ప్రసిద్ధి చెందిన జమ్మానిపల్లి నిడిమామిడమ్మదేవి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అమ్మవారి మూల విరాట్‌కు ఉదయం అభిషేకాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆల యం ఆవరణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ హోమాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
కొల్హాపురమ్మ గంగపూజ
రొళ్ల: మండలంలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన రత్నగిరిలో వెలిసిన కొల్హాపురి మహాలక్ష్మి బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం పాలబావిలో గంగపూజను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి పాలబావిలో గంగపూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులే కాకండా, కర్ణాటక ప్రాంతం నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 23 , 2024 | 11:49 PM