SANTHOS TROPHY: గోల్.. గోల్.. గోల్..!
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:06 AM
సంతోష్ ట్రోఫీ-2024 ఫుట్‌బాల్ పోటీలు ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలిండియా ఫుట్‌బాల్ అసోసియేషన అధ్యక్షుడు కళ్యాణ్ ఛౌబే, జేసీ శివ నారాయణశర్మ, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ఈ పోటీలను ప్రారంభించారు.
కర్ణాటక, తమిళనాడు జట్ల ఘన విజయం
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సంతోష్ ట్రోఫీ-2024 ఫుట్‌బాల్ పోటీలు ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలిండియా ఫుట్‌బాల్ అసోసియేషన అధ్యక్షుడు కళ్యాణ్ ఛౌబే, జేసీ శివ నారాయణశర్మ, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ ఈ పోటీలను ప్రారంభించారు. మొదటి మ్యాచలో తమిళనాడు జట్టు 7-0 గోల్స్ తేడాతో అండమాన నికోబర్‌పై విజయం సాధించింది. రెండో మ్యాచలో కర్ణాటక జట్టు 5-0 తేడాతో ఆంధ్రప్రదేశ జట్టుపై విజయం సాధించింది. రెండు మ్యాచలూ ఏకపక్షంగా సాగాయి. తమిళనాడు జట్టు ఆటగాళ్లు అలెగ్జాండర్ రోమియో, లీజో చెరో రెండు గోల్స్ కొట్టారు. విక్రం వెంకటాచలం, నందకుమార్ అనంతరాజ్ చెరో గోల్ కొట్టారు. అండమాన నికోబర్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. కర్ణాటక ఆటగాడు అభిషేక్ శంకర్ పవార్ 3 గోల్స్, రుద్రవేద్, అశ్విన చక్రవర్తి చెరో గోల్ కొట్టారు. ఆతిథ్య ఆంధ్రప్రదేశ జట్టు ఒక్క గోల్ కూడా సాధించలేకపోవడం క్రీడాభిమానులను నిరుత్సాహపరిచింది. రెండు ఆటలకూ వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడింది. మ్యాచల ప్రారంభానికి ముందు కళ్యాణ్ ఛౌబే మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌ను రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆర్డీటీ స్టేడియంలో క్రీడా సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని అభినందించారు. సంతోష్ ట్రోఫీ పోటీలకు జిల్లా వేదిక కావడం శుభపరిణామమని జేసీ శివనారాయణ శర్మ అన్నారు. పోటీలను విజయవంతం చేయడానికి ఆర్డీటీతో కలిసి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అనంతపురాన్ని క్రీడా రాజధానిగా మార్చేందుకు కొత్త ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని కొత్త ప్రభుత్వం అన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:06 AM