ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gravel నేరం నాయకులదేనా..!

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:09 AM

మండల వ్యాప్తంగా అక్రమ లే అవుట్లు వేశారు. వాటిలోకి వేల టిప్పర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వ, మాన్యం భూములను అడ్డదిడ్డంగా తవ్వేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచుకున్నారు.

టవర్‌ కూలకుండా ప్రజల సొమ్ముతో మట్టిని తోలుతున్న దృశ్యం

ఐదేళ్లపాటు అధికారులు చూడలేదా..?

అక్రమ లే అవుట్లు.. గ్రావెల్‌ తవ్వకాలు కనిపించలేదా..?

టీడీపీ నాయకులు ఫిర్యాదు.. కలెక్టర్‌ ఆదేశాలతోనే కదలిక

వైసీపీ హయాంలో చాలా శాఖలకు అవినీతి మరక

అధికారులు.. సిబ్బందిపై చర్యలు ఉండవా..?

యాడికి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా అక్రమ లే అవుట్లు వేశారు. వాటిలోకి వేల టిప్పర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వ, మాన్యం భూములను అడ్డదిడ్డంగా తవ్వేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచుకున్నారు. ఇదేమీ గుట్టుగా సాగిన వ్యవహారం కాదు. వేలాది మంది జనం చూస్తుండగా, రేయింబవళ్లూ నిరంతరాయంగా ప్రకృతి వనరులపై జరిగిన దాడి. ఇదంతా అప్పట్లో అధికారులకు కనిపించలేదా..? పోనీ.. కనిపించలేదనే అనుకుందాం..! నాటి ప్రతిపక్ష నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎందుకు స్పందించలేదు..? బాధ్యత లేకుండా ఎందుకు వ్యవహరించారు..? ఇదీ.. ఇప్పుడు మండల వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అక్రమాలలో అధికారుల నిర్లక్ష్యం ఎంత..? అవినీతి ఎంత..? దీన్ని నిగ్గు తేల్చాలి కదా..? అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల సహకారం లేకుండా గ్రావెల్‌ దందా, అక్రమ లే అవుట్ల సాధ్యం కాదని అంటున్నారు. ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా..? లేక దీనిపైనా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే చూద్దాం అనుకుంటారా..?

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అక్రమాలపై చర్యలు మొదలయ్యాయి. అదే తరహాలో యాడికి మండలంలో అక్రమార్కులపైనా చర్యలు మొదలయ్యాయి. గ్రావెల్‌ దందా గురించి టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలైంది. రెవెన్యూ, ట్రాన్సకో, మైన్స తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి.. తవ్వినవారిని, తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిని విచారించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మొదటి చర్యగా.. ట్రాన్సకో అధికారుల ఫిర్యాదు మేరకు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మిగిలిన శాఖల వ్యవహారం ఏమిటో త్వరలో తేలనుంది.

పోతే పోనీ అనుకున్నారా..?

గ్రావెల్‌ అక్రమ తవ్వకాల కారణంగా పెద్దపేట సమీపంలోని 220 కేవీ విద్యుత టవర్లు కూలిపోయే పరిస్థితి ఎదురైంది. ఓ టవర్‌ చుట్టూ ఏకంగా 14 అడుగుల లోతు తవ్వారు. కళ్లెదుటే కనిపిస్తున్నా ఆ శాఖ అధికారులు ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. ఎవరో ఫిర్యాదు చేయాలి.. ఇంకెవరో విచారించి.. అక్రమం నిజమే అని నిర్ధారించాలి..! అప్పుడుగానీ విద్యుత శాఖ చర్యలకు దిగదు..! వైసీపీ నాయకులు తవ్వగా ఏర్పడిన గుంతలలోకి మట్టిని తోలి పూడుస్తున్నారు. ఇది ప్రజలకు ఇంకో నష్టం..! వందల ట్రాక్టర్ల గ్రావెల్‌ను తరలించినా.. మునుపటి పటిష్టత రాదు. అనుకోని ప్రమాదం జరిగి ఉంటే.. పరిస్థితి ఏమిటి..? టవర్లను తిరిగి ఏర్పాటు చేసేందుకు ఎంత ఖర్చు అయ్యేది..? విద్యుత సరఫరా రోజుల తరబడి నిలబడితే.. వాటి పరిధిలోని పరిశ్రమలు, ఇతర వినియోగదారులకు జరిగే నష్టాన్ని పూడ్చేది ఎవరు..? ఒక్కో టవర్‌ ఏర్పాటుకు రూ.2 కోట్ల దాకా ఖర్చవుతుందని, కనీసం నాలుగు టవర్లు కూలేవని అధికారులు అంటున్నారు. ఈ లెక్కన టవర్ల పునరుద్ధరణకు రూ.8 కోట్ల దాకా అవుతుంది. దీనికంతటికీ కారణం అధికారల నిర్లక్ష్యం, అవినీతి వ్యవహారాలు కాదా..? అని జనం ప్రశ్నిస్తున్నారు.

దేవుడికే వదిలేశారా..?

మాన్యం భూముల సహా.. ఆలయాలకు సంబంధించిన అన్ని ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ కోసం ప్రత్యేకంగా దేవదాయశాఖ ఉంది. అన్నీ దేవుడే చూసుకుంటాడులే అన్నట్లుగా వ్యవహరించారు ఆ శాఖ అధికారులు. వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా తవ్విన 220 కేవీ విద్యుతటవర్‌ ఉన్న ప్రాంతం ఆలయ మాన్యం భూమి. అక్కడ భారీగా తవ్వకాలు జరిగినా ఆ శాఖ అధికారులు నిద్రమత్తు ఎందుకు నటించినట్లు..?

కనబడలేదా?

లే అవుట్లు వేసి.. ప్లాట్లు విక్రయించడం అంటే గుట్టుగా సాగే పనికాదు. మార్కెటింగ్‌ వ్యవహారం..! ఊరూవాడా తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా పంచాయతీ, రెవెన్యూ శాఖల ప్రమేయం లేకుండా లే అవుట్లు వేయడం జరగదు. కానీ యాడికి మండలంలో చాలా లే అవుట్లు అనుమతి లేకుండానే వేశారు. గ్రావెల్‌ దందాపై విచారణ సమయంలో వీటి ప్రస్తావనా వచ్చింది. అక్రమ లే అవుట్లపై ఫిర్యాదుల వెళితే.. తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేశారు. వైసీపీ హయాంలో చాలామంది అధికారులు ముడుపులు తీసుకుని మౌనం వహించారు.

వెంటనే స్పందించాలి కదా..?

సమస్య ఏదైనా.. అధికారులు వెంటనే స్పందించాలి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారుల బాధ్యత. ప్రజలు ఫిర్యాదు చేసినా, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వెంటనే స్పందించడం లేదు. అందుకే అక్రమార్కులు రెచ్చిపోతుంటారు. అధికారులు వెంటనే స్పందిస్తే నష్టాన్ని అరికట్టవచ్చు. విద్యుత టవర్‌ వద్ద గ్రావెల్‌ తవ్వకం విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. అంత పెద్దఎత్తున గ్రావెల్‌ తరలింపు ఒకటి రెండురోజుల్లో జరిగే పనికాదు. సమస్య అధికారుల దృష్టికి వెళ్లినా చూసీచూడనట్లు వ్యవహరించారు. అందుకే విద్యుత టవర్‌ కూలిపోయే దశకు చేరుకుంది. ఈ నష్టాన్ని ప్రజలే భరించాల్సి వస్తున్నది. టీడీపీ నాయకుల ఫిర్యాదుతోనే వైసీపీ నాయకులపైన చర్యలు చేపడుతుండడంతో పార్టీల మధ్య చిచ్చుపెట్టేలా అధికారుల తీరుఉంది.

- పరిమి చరణ్‌, రాయలచెరువు

బాధ్యతగా వ్యవహరిస్తే..

అధికారులు బాధ్యతగా విధులను నిర్వర్తిస్తే ఏ సమస్యలూ ఉండవు. కొందరు అధికారుల స్వార్థం, అవినీతి కారణంగా ఇలా జరుగుతోంది. మరికొందరు రెండు పార్టీ నాయకుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. ఏదైనా సమస్య అధికారుల దృష్టికి వెళ్లినప్పుడు తక్షణమే స్పందిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

- గంగాధర్‌, యాడికి

Updated Date - Dec 18 , 2024 | 12:09 AM