HARVESTING: పంటకోత ప్రయోగాలు పక్కాగా నిర్వహించాలి
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:46 PM
జిల్లావ్యాప్తంగా ఖరీ్‌ఫలో సాగుచేసిన పంటలకు సంబంధించి పంటకోత ప్రయోగాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 24: జిల్లావ్యాప్తంగా ఖరీ్‌ఫలో సాగుచేసిన పంటలకు సంబంధించి పంటకోత ప్రయోగాలు పక్కాగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. శనివారం స్థానిక సీపీఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్లో సీపీఓ అశోక్‌కుమార్, ఉద్యానశాఖ జిల్లా అధికారి నరసింహారావుతో కలిసి ఏడీఏలు, ఏఓలు, ఏఎ్‌సఓలు, ఉద్యాన అధికారులతో సమావేశమయ్యారు. ఈ ఏడా ది ఖరీ్‌పలో సాగైన పంటల దిగుబడిని తెలుసుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పంట కోత ప్రయోగాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ప్రణాళిక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన సమయంలోగా ప్రయోగాలు పూర్తి చేయాలన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 11:46 PM