YCP People's Representative : చెరువును అమ్మేశాడు..!
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:19 AM
అధికారంలో ఉన్నాం కదా అని వైసీపీ వారు గడిచిన ఐదేళ్లు బరితెగించి వ్యవహారాలు నడిపారు. అక్రమ సంపాదన కోసం అడ్డమైన పనులన్నీ చేశారు. అనంతపురం రూరల్ మండలంలో ఓ ప్రజాప్రతినిధి అక్రమ లే అవుట్ వేయడంతోపాటు.. చెరువు స్థలాన్ని కబ్జా చేసి మరీ అమ్మేశాడు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని రాచానపల్లిలో ఈ వ్యవహారం నడుస్తోంది. సర్వే నంబరు 171లో రాచానపల్లి చెరువు ఉంది. ఆ చెరువకు ఆనుకుని వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు లే అవుట్ వేశారు. అదికూడా అనధికారిక లే అవుటే. ఇది ...
వైసీపీ ప్రజాప్రతినిధి బరితెగింపు.. అక్రమ లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణం
అనంతపురం రూరల్, జూన 20: అధికారంలో ఉన్నాం కదా అని వైసీపీ వారు గడిచిన ఐదేళ్లు బరితెగించి వ్యవహారాలు నడిపారు. అక్రమ సంపాదన కోసం అడ్డమైన పనులన్నీ చేశారు. అనంతపురం రూరల్ మండలంలో ఓ ప్రజాప్రతినిధి అక్రమ లే అవుట్ వేయడంతోపాటు.. చెరువు స్థలాన్ని కబ్జా చేసి మరీ అమ్మేశాడు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని రాచానపల్లిలో ఈ వ్యవహారం నడుస్తోంది. సర్వే నంబరు 171లో రాచానపల్లి చెరువు ఉంది. ఆ చెరువకు ఆనుకుని వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు లే అవుట్ వేశారు. అదికూడా అనధికారిక లే అవుటే. ఇది
చాలదన్నట్లు లే అవుట్‌కు ఆనుకుని ఉన్న ఎకరం చెరువు స్థలాన్ని ఆక్రమించాడు. ప్లాట్లు వేసి అమ్మేశాడు. కొన్నవారిలో కొందరు షెడ్లు వేశారు. ఒకరిద్దరు ఓ మాదిరి ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంకొందరు బండలు పాతుకుని హద్దు వేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెంటు స్థలం ఐదారు లక్షలు పలుకుతోంది. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధికా బాగానే గిట్టుబాటు అయింది. చెరువును ఆక్రమించి ఇళ్లను నిర్మిస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. అక్కడికి వెళ్లి ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలని హెచ్చరించారు. కానీ అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటం, ఆక్రమించిన వ్యక్తి ఆ పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో నిర్మాణాల జోరు మరింత పెరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని.. లేదంటే చెరువు మాయమౌతుందని స్థానికులు అంటున్నారు.
నిలిపివేయాలని చెప్పాం..
చెరువు స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం మా దృష్టికి వచ్చింది. అక్కడికి వెళ్లి పరిశీలించాం. చెరువు స్థలంలో నిర్మాణాలను నిలిపివేయాలని హెచ్చరించాము. మళ్లీ నోటీసులు జారీ చేస్తున్నాం. అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారిపై చర్యలు తీసుకుంటాం.
-కృష్ణకుమార్, ఏఈ, ఇరిగేషన
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 21 , 2024 | 12:19 AM