ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mortuary : శవాల నరకం

ABN, Publish Date - Aug 11 , 2024 | 12:23 AM

జిల్లా ఆస్పత్రిలో కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆస్పత్రి కంటే నరకమే నయమనేలా కొందరి తీరు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. అసలే తమ మనిషి చచ్చిపోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని సైతం కాసుల కోసం పీడిస్తున్నారు. డబ్బులిస్తేనే పోస్టుమార్టం చేస్తామంటూ వేధిస్తున్నారు. ఇవ్వకపోతే గంటలతరబడి నిరీక్షించాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసినా...

Mortuary building of district hospital

పోస్టుమార్టమ్‌ చేయాలంటే పైసలివ్వాల్సిందే

ఇటీవల రూ.ఆరు వేలు వసూలు

పీక్కుతింటున్న సర్వజనాస్పత్రి సిబ్బంది

బాలింతల వార్డులో బిడ్డకో లెక్క

చోద్యం చూస్తున్న యంత్రాంగం

జిల్లా ఆస్పత్రిలో కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆస్పత్రి కంటే నరకమే నయమనేలా కొందరి తీరు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. అసలే తమ మనిషి చచ్చిపోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని సైతం కాసుల కోసం పీడిస్తున్నారు. డబ్బులిస్తేనే పోస్టుమార్టం చేస్తామంటూ వేధిస్తున్నారు. ఇవ్వకపోతే గంటలతరబడి నిరీక్షించాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసినా పర్యవేక్షణాధికారులు మిన్నకుండిపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

- అనంతపురం టౌన

ఫ వారం కిందట ఓ మృతదేహానికి పోస్టుమార్టమ్‌ చేయడానికి డాక్టర్లు రూ.ఆరు వేలు వసూలు చేశారు. ఈ విషయంపై కలెక్టరుకు ఫిర్యాదు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. పోస్టుమార్టం చేయకుండా వేధిస్తుంటే తామే మధ్యవర్తులుగా ఉండి డబ్బులు ఇప్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఓ పోలీసులు విలేకరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. దీన్నిబట్టి ఆస్పత్రిలో పోస్టుమార్టమ్‌ చేయాలంటే కాసులు ఎంత మేర పీక్కుతింటున్నారో తెలుస్తోంది.

ఫ్రీజర్స్‌లో ఉంచకుండా బయటే మృతదేహాలు

శవాలు పాడైపోకుండా ఉండేందుకు మార్చురీలో ప్రీజర్లు ఉంచారు. అధికారిక లెక్కల మేరకు జిల్లా ఆస్పత్రిలో ఆరు ప్రీజర్లు ఉన్నాయి. అయితే మృతదేహాలను మాత్రం ఫ్రీజర్‌లలో ఉంచడం లేదు. మార్చురీలో బండలతో కట్టిన కట్టలపై పడేస్తున్నారు. ఎండాకాలంలో అయితే ఆ శవాలు గంటల వ్యవధిలోనే పాడైపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. కనీసం కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మార్చురీలోకి వెళ్లి మృతదేహాలను చూడాలన్నా ఇబ్బంది పడాల్సివస్తోంది. ఆరు ఫ్రీజర్లు ఉన్నా అవి ఎపుడు సక్రమంగా పని చేయడంలేదని చెబుతున్నారు. అందుకే ఇక్కడ శవాలను బయటే ఉంచుతున్నట్లు చర్చసాగుతోంది. గత గురువారం కూడా ఒక శవాన్ని కట్టపై పడేయడం చూసిన పలువురు అయ్యో అంటూ నిట్టూర్చారు. కానీ ఇంత జరుగుతున్నా అక్కడే ఉండే వైద్యాధికారులు, డాక్టర్లు, సిబ్బంది కనీసం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

బాలింతల వార్డులోనూ దందా

జిల్లా ఆస్పత్రిలోని బాలింతల వార్డులోను దందా సాగుతోంది. ఎఫ్‌ఎనఓలు ధర పెట్టి బాలింతల బంధువుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఆడబిడ్డ అయితే రూ.1000లు, మగబిడ్డ పుడితే రూ.2వేలు గుంజుతున్నారని బాలింతల కుటుంబ సభ్యులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. బాలింతకు చీరమార్చినందుకు రూ100లు, బెడ్డు మార్చినందుకు రూ.200లు ప్రకారం కొందరు ఎఫ్‌ఎనఓలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పర్యవేక్షణ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏం చర్యలు ఉండటం లేదు. ఎఫ్‌ఎనఓలకు డ్యూటీలు వేసేదే అధికారులన ప్పుడు ఇంక ఎలా చర్యలు తీసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. కొందరు డాక్టర్లు తమ అక్రమ వ్యవహారాలన్నీ ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలతోనే సాగిస్తుంటారని అందుకే వారి అక్రమాలపై చూసీచూడనట్లు ఉంటారన్న ప్రచారం సాగుతోంది.


పర్యవేక్షణ అధికారుల వితండవాదన

మార్చురీ ఘటనలపై పర్యవేక్షణ వైద్యాధికారులు వితండవాదనలు వినిపిస్తున్నారు. ఆరు ప్రీజర్లు పని చేస్తున్నాయని ఆస్పత్రి పర్యవేక్షణ అధికారులు అంటున్నారు. అయితే డాక్టర్ల మాత్రం ఈ వ్యవహారం తమ పరిధికాదని తప్పించుకుంటున్నారు. ఎంఎనఓలు, ఇతర సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామంటున్నారు. డాక్టర్లను పర్యవేక్షించే మరో అధికారి మాత్రం శవాలకు కట్టకట్టడానికి వస్త్రం, వాసన రాకుండా ఉండటానికి కెమికల్స్‌ ఆస్పత్రి నుంచి సరఫరా చేయాలని అది చేయడంలేదని వాటికోసం తీసుకోవాల్సి వస్తోందని తమ సిబ్బంది చెబుతున్నట్లు పేర్కొన్నారు.

ఆ డాక్టర్లు మాపరిధిలో ఉండరు

పోస్టుమార్టమ్‌ చేసే డాక్టర్లు మాపరిధిలో ఉండరు. వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ వారిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. పోస్టుమార్టమ్‌ సమయంలో ఎంఎనఓలు, ఇతర నాలుగోతరగతి ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే మాదృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకొని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. మార్చురీలో ఫ్రీజర్లు పని చేస్తున్నాయని రెండురోజుల కిందట కూడా చెప్పారు. బాలింతల వార్డులో దందాపైనా విచారిస్తా. బాధ్యులపై చర్యలు తీసుకుంటా.

- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

వస్త్రం, కెమికల్స్‌ కోసమేనట

మార్చురీలో పోస్టుమార్టమ్‌ కోసం డాక్టర్లు డబ్బులు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు మాదృష్టికి వచ్చాయి. ఇటీవల జరిగిన ఓ ఘటన కలెక్టరు వరకు వెళ్లింది. దీనిపై విచారణ చేయగా మృతదేహం ప్యాకింగ్‌కు వస్త్రం, కెమికల్స్‌ కోసం డబ్బు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇవి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ద్వారానే తెప్పించి ఇవ్వాలి, కానీ వారు సరఫరా చేయడం లేదంటున్నారు. ఇదే విషయం కలెక్టరుకు నివేదించాం. - డాక్టర్‌ మాణిక్యాలరావు, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 12:23 AM

Advertising
Advertising
<