crop సస్యరక్షణ చర్యలతో అధికదిగుబడి
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:37 AM
వరి సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మద్దిలేటి సూచించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఆయన గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వరి సాగు చేస్తున్న రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
కణేకల్లు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): వరి సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మద్దిలేటి సూచించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఆయన గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వరి సాగు చేస్తున్న రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నందున రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో సరైన మందులు పిచికారీ చేయడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే అధికదిగుబడులు సాధించవ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రీసోర్స్‌సెంటర్ ఏడిఏ శైలజ, ఏవో శ్రీనివాసులు, ఫారం ఏడిఏ నారాయణనాయక్, స్థానిక ఏవో శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 07 , 2024 | 12:37 AM