ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP LEADERS : అభివృద్ధి చూసి ఓర్వలేక ఎమ్మెల్యేపై అక్కసు

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:26 AM

ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన సొంత పత్రిక అక్కసు వెళ్లగక్కుతున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన నరసింహ రాజు తదితరులు శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కా రం కోసం ఎమ్మెల్యే సొంత డబ్బుతో దాదాపు 20 బోర్ల వరకు వేయించా రని అన్నారు.

TDP leaders speaking at a press conference

టీడీపీ నాయకుల మండిపాటు

మడకశిర టౌన, ఆగస్టు 23: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన సొంత పత్రిక అక్కసు వెళ్లగక్కుతున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన నరసింహ రాజు తదితరులు శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కా రం కోసం ఎమ్మెల్యే సొంత డబ్బుతో దాదాపు 20 బోర్ల వరకు వేయించా రని అన్నారు. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి చేపడుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి నేరుగా అవినీతికి పాల్పడినా వారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఈ విధంగానే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు పోతే తమ ఉనికి ఉండదని... ఉద్దేశపూర్వకంగా ఆ పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తు న్నారని అన్నారు. ఇలాంటి వాటిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, మరోసారి ఇలా జరిగితే తగిన గుణపాఠం చెబు తామని హెచ్చరించారు. ఈసందర్భంగా డాక్టర్‌ సెల్‌ నియోజకవర్గం అధ్యక్షుడు కృష్ణమూర్తి, జనసేన మండల అధ్యక్షుడు శివాజీ, మీడియా కోఆర్డినేటర్‌ రవికుమార్‌, పుల్లయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 24 , 2024 | 12:26 AM

Advertising
Advertising
<