KALAVA ROADSHOW: ప్రజలకు పాలేరులా పనిచేస్తా: కాలవ
ABN, Publish Date - May 09 , 2024 | 11:40 PM
తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరులా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట, బండూరు, దేవగిరి, బొమ్మనహాళ్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో కాలవ శ్రీనివాసులుకు జనం నీరాజనం పలికారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు రోడ్‌షోలో పాల్గొన్నారు.
బొమ్మనహాళ్, మే 9: తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరులా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట, బండూరు, దేవగిరి, బొమ్మనహాళ్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో కాలవ శ్రీనివాసులుకు జనం నీరాజనం పలికారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు రోడ్‌షోలో పాల్గొన్నారు. బొమ్మనహాళ్‌లో పెద్ద ఎత్తున గజమాలతో క్రేన ద్వారా కొత్తపల్లి సోదరుల ఆధ్వర్యంలో స్వాగతించారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉంతకల్లు వద్ద డ్యాం నిర్మించి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో హెచ్చెల్సీ నీటి కోసం రాత్రి వేళలో కాపలా వెళ్లకుండా సాగునీటిని అందించామని ఈ వైసీపీ పాలనలో ఏ ఒక్కరోజైనా ఆయకట్టుకు సాగునీరు అందాయా అని ప్రశ్నించారు. ఈ రాషా్ట్రన్ని చంద్రబాబు తప్ప ఎవరూ బాగుపరచలేరని అన్నారు. వైసీపీ పాలనలో తొమ్మిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారని, టీడీపీ పాలనలో ఒక్కసారి కూడా పెంచలేదని గుర్తు చేశారు. అసమర్థ జగనరెడ్డి పాలనను అంతమొందించేందుకు సామాన్య ప్రజలకు ఓటే పాశుపతాస్త్రం అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మెట్టు గోవిందరెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని, అతన్ని గెలిపిస్తే తన వ్యాపార అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోడన్నారు.
పలువురు టీడీపీలో చేరిక: బొమ్మనహాళ్ మండలంలోని గోనేహాళ్, ఉంతకల్లు క్రాస్, దేవగిరి గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు కాలవ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలో చేరారు. క్లస్టర్ కన్వీనర్ కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీలు కుమ్మరి మల్లికార్జున, వాణిజగన్నాథ్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ మహేంద్ర, అప్పారావు, కాంతారావుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు నాగేంద్ర, కటిగె నారాయణ, ఆర్‌సీ వన్నూరుస్వామి, వడ్డే ఉమాపతి, రామరాజుతో పాటు 15 కుటుంబాలు పార్టీలోకి చేరారు.
ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు
రాయదుర్గంరూరల్: బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో ముస్లిం మైనార్టీలకు ఎలాంటి నష్టం జరగదని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పాట పాడుతున్న సీఎం జగనమోహనరెడ్డి వారిని ఘోరంగా అవమానించారన్నారు. ఐదేళ్లలో ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. రాష్ట్రంలో ఆరు మందికైనా దుల్హన పథకం అందించారా అని ఎద్దేవా చేశారు. 2014-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఐదేళ్లలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నట్లు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో విద్యావంతుడు, సౌమ్యుడు అయిన కాలవ శ్రీనివాసులుకు, ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మినారాయణకు సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన కడ్డిపుడి మహబూబ్‌సాబ్, నాయకులు వినాయక, షబ్బీర్ పాల్గొన్నారు.
Updated Date - May 09 , 2024 | 11:40 PM