ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PUMP HOUSE LABOURS: సమస్యలు పరిష్కరించకుంటే.. ఆందోళనలు ఉధృతం

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:51 PM

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని సత్యసాయి తాగునీటి కార్మికులు డిమాండ్‌ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్లూరులోని సత్యసాయి పంపుహౌస్‌ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శనివారానికి మూడు రోజులకు చేరుకుంది.

Workers participating in the strike at the Sathya Sai Pump House in Kallur

గార్లదిన్నె, ఆగస్టు 24: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని సత్యసాయి తాగునీటి కార్మికులు డిమాండ్‌ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్లూరులోని సత్యసాయి పంపుహౌస్‌ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శనివారానికి మూడు రోజులకు చేరుకుంది. వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నామన్నారు. ఆరు నెలల నుంచి వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు నాగభూషణం, బాషా, మల్లరాయుడు, శ్రీనివాసులు, సాంబశివ, జనార్ధనరెడ్డి, నాగవర్ధన పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:51 PM

Advertising
Advertising
<