TATKAL: తత్కాల్‌లో దళారుల దందా..!
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:23 AM
అనంతపురం రైల్వే స్టేషనలో తత్కాల్ టికెట్ల జారీలో దళారుల దందాతో అసలైన ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీనికి తోడు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో అర్థం కాని పరిస్థితి. రిజర్వేషన కోసం నాలుగు కౌంటర్లు వినియోగించేలా భవనం అందుబాటులో ఉంది.
గంటల తరబడి పడిగాపులు
ప్రయాణికులకు తప్పని తిప్పలు
అనంతపురం న్యూటౌన, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): అనంతపురం రైల్వే స్టేషనలో తత్కాల్ టికెట్ల జారీలో దళారుల దందాతో అసలైన ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీనికి తోడు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో అర్థం కాని పరిస్థితి. రిజర్వేషన కోసం నాలుగు కౌంటర్లు వినియోగించేలా భవనం అందుబాటులో ఉంది. నిర్వహణ మాత్రం అందుకు విరుద్దంగా అమలవుతోంది. గతంలో ఉన్న పాత రిజర్వేషన కౌంటర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు కౌంటర్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం సౌకర్యాలు పెంచారు. ప్రయాణికుల రద్దీ పెరిగినా రిజర్వేషన కౌంటర్ మాత్రం ఒక్కటే అందుబాటులో ఉంటోంది. తత్కాల్ సమయంలో కూడా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా యంత్రాంగం చర్యలు చేపట్టలేదు. పేరుకు మాత్రం తత్కాల్ సమయంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కనీసం రెండు గంటలు కూడా రెండు కౌంటర్లు తీయలేని దుస్థితి నెలకొంది. రిజర్వేషనకు ఒక్క కౌంటర్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రయాణికులు తత్కాల్ టికెట్ కోసం తమ వరకు వస్తుందో లేదో అని బిక్కు బిక్కుమంటూ లైనలో నిలబడుతున్నారు. లైనలో ఉన్నా ప్రయాణికుల క్యూ మాత్రం ముందుకు కదలడం లేదు. ముందు రోజు రాత్రి నుంచి దళారులు క్యూలైనలో ఫామ్స్ పెట్టి తమ పని కానిచ్చుకూంటూ రాకెట్‌ను నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు ప్రధాన సాక్ష్యంగా తత్కాల్ టికెట్ కోసం లైనలో నిలబడిన వారికి ఎవరికీ దొరకకపోవడమేనని తెలుస్తోంది. రెండుమూడు సార్లు స్టేషనలో తత్కాల్ టికెట్ కోసం వచ్చి వెనుతిరిగిన వారు తిరిగి స్టేషన వైపు రారని ప్రచారం జరుగుతోంది. ఏ ఆనలైన సెంటర్‌లోనో దళారులను సంప్రదించి రెండింతలు సొమ్ము చెల్లించి టికెట్స్ పొందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ నెలకొన్న అస్తవ్యస్తమైన నిర్వహణతో సమీపంలోని రైల్వేస్టేషన్లలో ఉన్న కౌంటర్లకు వెళ్లడమా? లేదా ఆనలైన సెంటర్ల వద్ద దళారులను సంప్రదించడమా అన్నది రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తత్కాల్ సమయంలోనైనా రద్దీకి అనుగుణంగా కౌంటర్లు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
=======================
బంపర్ బడ్జెట్
ఫ జిల్లాకి బడ్జెట్ బూస్ట్
ఫ నీటి ప్రాజెక్టులకు నిధుల వరద
ఫ వ్యవసాయానికి భారీగా కేటాయింపులు
ఫ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
ఫ నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఫ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం
ఫ ఉపాధి కల్పనకు ఊతం
కరువు జిల్లాకి రాష్ట్ర బడ్జెట్ బూస్ట్‌నిచ్చింది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడనుంది. జిల్లా అభివృద్ధికి కీలకమైన నీటి పారుదల, రహదారులు, పరిశ్రమల ఏర్పాటు, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి హితోధికంగా నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్‌తో జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి ఊసేలేకుండా పోయింది. అన్నిరంగాలూ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్.. అన్నిరంగాలకు ప్రాణం పోసింది.
- పుట్టపర్తి (ఆంధ్రజ్యోతి)
నిధుల వరద
జిల్లా అభివృద్ధికి ప్రధాన వనరు నీరు. తద్వారా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతి సాధ్యం. అంతటి కీలమైన నీటి ప్రాజెక్టులపై గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయింది. ఉన్నవాటికి కూడా మరమ్మతులు చేయలేక చేతులెత్తేసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ.16,705 కోట్లు కేటాయించింది. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1077 కోట్లు సమకూర్చనుంది. అందులో హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.822 కోట్లు, హెచ్చెల్సీ మరమ్మత్తులకు రూ.30 కోట్లు కేటాయించారు. తద్వారా హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లాకు రెట్టింపు మొత్తంలో సాగునీరు అందనుంది. తద్వారా పంటల సాగు పెరుగుతుంది. పారిశ్రామిక ప్రగతి సైతం పరుగులు పెట్టనుంది.
అభివృద్ధికి బాటలు
జిల్లాలో కియ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో పారిశ్రామిక హబ్‌గా అవతరించింది. మరిన్ని పరిశ్రమలు రావాలంటే రోడ్ల అభివృద్ధి ముఖ్యం. ఇప్పటికే జిల్లాలో పలు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో రోడ్లు, భవనాలకు రూ.9,554 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. రోడ్లు అభివృద్ధి చెందితే.. పారిశ్రామికంగా మరింత ప్రగతి సాధ్యమవుతుంది. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. శిల్పకళల కాణాచి లేపాక్షి, రాయల రెండో రాజధాని పెనుకొండ, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి, విదేశీ అతిథులు విడిదిచేసే వీరాపురం, ముద్దిరెడ్డిపల్లి, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, తిమ్మమ్మ మర్రిమాను ఇలా చెప్పుకుంటూపోతే జిల్లా అంతటా పర్యాటక, చారిత్రాత్మక సంపద, కళాకృతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జిల్లాకు కలిసొచ్చే అంశం.
సంక్షేమం..
బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఏకంగా రూ.69 వేల కోట్లు కేటాయించారు. మహిళా, శిశు సంక్షేమానికి ఏకంగా రూ.4285 కోట్లు ప్రకటించారు. ఈ కేటాయింపులపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నైపుణ్యాల పెంపునకు కళాశాలలు
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతోంది. యువత ఉద్యోగాలు సాధించేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు బడ్జెట్‌లో శ్రద్ధ చూపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా 192 కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదించారంటే ఉమ్మడి జిల్లాలో 2 నుంచి 3 కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశముంది. ఇది పారిశ్రామికాభివృద్ధిలో వచ్చే ఉద్యోగావకాశాలను జిల్లా యువత దక్కించుకునేందుకు దోహదపడనుంది.
అన్నదాతకు అండ
బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి భారీగా కేటాయించారు. అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, మార్కెటింగ్, విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలు, ఎరువుల పంపిణీ, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, రైతు సేవాకేంద్రాలు, ఉద్యాన, సహకార శాఖల ద్వారా రైతును ఆదుకునేందుకు ఏకంగా బడ్జెట్‌లో రూ.43,402 కోట్లు ప్రకటించారు. కరువు కోరల్లో చిక్కిన జిల్లా రైతాంగానికి ఇది బిగ్ రిలీఫ్.
కియ కార్ల పరిశ్రమ
=========================
నిధులున్నా... అందని అద్దెలు
ఫ ఐసీడీఎస్ పురం ప్రాజెక్టులో చోద్యం
ఫ అంగనవాడీ భవనాల అద్దెల చెల్లింపులో జాప్యం
ఫ నిధులు వచ్చి పక్షం రోజులైనా చెల్లించని దుస్థితి
ఫ వర్గపోరే కారణమన్న విమర్శలు
హిందూపురం అర్బన, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో బడ్డెట్ వచ్చిందంటే వెంటనే బిల్లులు చెల్లించేస్తారు. ఐసీడీఎస్ హిందూపురం ప్రాజెక్టులో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంగనవాడీ కేంద్రాల అద్దెలకు సంబంధించి నిధులు వచ్చి పక్షం రోజులైనా చెల్లింపులు మాత్రం చేయట్లేదు. ప్రాజెక్టులో అధికారుల మధ్య వర్గపోరే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అంగనవాడీ కేంద్రాలకు భవనాలను అద్దెకిచ్చిన వారికి ఎదురుచూపులు తప్పట్లేదు. అద్దెల కోసం వారు ఒత్తిడి చేస్తుంటే.. అంగనవాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సొంత డబ్బు చెల్లిస్తున్నారు. నిధులొచ్చినా ఈ దుస్థితి ఏంటని వారు వాపోతున్నారు.
మే నెల నుంచి పెండింగ్
హిందూపురం పట్టణ పరిధిలో ఒక్కో అంగనవాడీ కేంద్రం భవనానికి రూ.6 వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో రూ.2 వేలు ఇస్తున్నారు. హిందూపురం పట్టణంలో 67 అద్దె భవనాలున్నాయి. వీటికి నెలకు అద్దె రూ.4.02 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రూరల్ ప్రాంతాల్లో 117 అద్దె భవనాలున్నాయి. వీటికి నెలకు రూ.2.34 లక్షలు అద్దెల రూపంలో కట్టాల్సి ఉంటుంది. అంగనవాడీ కేంద్రాల అద్దె బిల్లులు ఈ ఏడాది మే నెల నుంచి పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో భవనాల యజమానులు ఖాళీ చేయాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇకట్రెండు నెలలైతే ఫర్వాలేదు కానీ, ఇన్ని నెలలు అంటే కుదరదని తెగేసి చెబుతున్నారు. కొందరైతే తాళాలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో చేసేది లేక అంగనవాడీ కార్యకర్తలు తమ వేతనాలు నుంచి, అప్పులు తెచ్చి అద్దెలు చెల్లించిన సందర్భాలున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు.
కారణాలేంటో..?
ప్రాజెక్టులో నిధులున్నా చెల్లింపులు చేయకపోవడానికి కారణమేంటోనన్న చర్చలు సాగుతున్నాయి. ఓ ఉన్నతాధికారికి బిల్లుల చెల్లింపుపై అవగాహన లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా తెలియదని ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఇదివరకు అక్కడ పనిచేసే అధికారులు.. బిల్లులు చేయడంలో సహకరించేవారని తెలుస్తోంది. ఉన్నతాధికారితో వారికి విభేదాలు తలెత్తడంతో తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో బిల్లుల చెల్లింపు ముందుకు కదలట్లేదని ప్రాజెక్టు వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లుల చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారి వద్దే ఉంచుకోవడం సరికాదు
అంగనవాడీ కార్యకర్తలకు వచ్చేది అరకొరత జీతం. దాంతోనే ఇంటిని అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్నాం. కొందరు వేతనాల నుంచి అంగనవాడీ కేంద్రం భవనాల అద్దెలు చెల్లించారు. ఇంకొందరు అప్పులు చేసి, కట్టారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిధులు వచ్చి నెల కావస్తున్నా చెల్లించకుండా వారి వద్దే ఉంచుకోవడం సరికాదు. వెంటనే చెల్లించి, ఆదుకోవాలి.
- లావణ్య, అంగనవాడీ యూనియన ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి
మేళాపురంలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగనవాడీ కేంద్రం
=======================
లైనలో నిలబడినా టికెట్ కష్టమే
అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లడానికి తత్కాల్ టికెట్ తీసుకోవడం కోసం రైల్వే స్టేషనలోని కౌంటర్‌కు వచ్చాను. తత్కాల్ సమయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిసి గంట ముందుగానే వచ్చి లైనలో నిలబడి ఉన్నా. అసలు లైన మాత్రం ముందుకు కదలడం లేదు. సమయం అయిపోయింది. టికెట్ మాత్రం రాలేదు. ఇక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
-సుధ, ప్రయాణికురాలు
రెండు గంటలు ముందుగా వచ్చాం
విజయవాడ నుంచి అనంతపురం రావడానికి తత్కాల్ టికెట్ తీసుకోవడం కోసం రెండు గంటలు ముందుగా లైనలో వచ్చి నిలబడినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇక్కడ జరుగుతున్న దందా ఏమిటన్నది అర్థం కానిపరిస్థితి. ఇంత రద్దీ ఉన్నప్పటికీ ఒకే కౌంటర్ నిర్వహణ ఉండడం దారణం. అధికారులు స్పందించి ప్రయాణికుల సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
- రామకృష్ణ, ప్రయాణికుడు
లైనలో నిలబడి నీరసించాల్సిందే
అనంతపురం నుంచి అత్యవసర పనిమీద హైదరాబాద్ వెళ్లాల్సి ఉండడంతో తత్కాల్ టికెట్ కోసం వచ్చాం. లైనలో నిలబడి నిరసించాల్సిందే తప్పా.. టికెట్ మాత్రం దొరకలేదు. ఇక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
- జగన్నాథ్, ప్రయాణికుడు
Updated Date - Nov 12 , 2024 | 12:23 AM