ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

POSTERS: ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనం పోస్టర్ల ఆవిష్కరణ

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:13 AM

ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనం పోస్టర్లను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బడా కార్పొరేట్‌ కంపెనీలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు.

అనంతపురం విద్య, ఆగస్టు 4: ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనం పోస్టర్లను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బడా కార్పొరేట్‌ కంపెనీలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. దేశ సంపద కొందరు కార్పొరేట్ల చేతుల్లోనే ఉందన్నారు. కష్టజీవులు సంపదను సృష్టిస్తే, కార్పొరేట్‌ శక్తులు లక్షల కోట్లు కూడబెట్టుకుంటున్నాయని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలన్నారు. తమతో కలసి పోరాటం చేసిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏ కూటమితో అధికారంలో ఉన్నాయన్నారు. ఇప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అదేవిధంగా 44 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి....4 లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిన బీజేపీ వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 1, 2, 3 తేదీల్లో విశాఖలో జరిగే జాతీయ సమ్మేళన వేడుకకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజే్‌షగౌడ్‌, ఉప ప్రధానకార్యదర్శి మల్లికార్జున, కార్యనిర్వాహక అధ్యక్షుడు కృష్ణుడు, గోవిందు, మురుసు శ్రీనివాసులు, ఉప్పు శ్రీనివాసులు, చిరంజీవి, రాజు, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<