PENSIONS DISTRIBUTION: పింఛన్ల పెంపు టీడీపీతోనే సాధ్యం
ABN, Publish Date - Jun 30 , 2024 | 11:43 PM
రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం చంద్రబాబునాయుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపారని టీడీపీ క్లస్టర్ కన్వీనర్ ఉడేగోళం మారుతి అన్నారు. ఆదివారం స్థానిక ఆంజనేయస్వామి కట్ట వద్ద పింఛనదారులతో సమావేశమయ్యారు.
కణేకల్లు, జూన 30: రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం చంద్రబాబునాయుడు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపారని టీడీపీ క్లస్టర్ కన్వీనర్ ఉడేగోళం మారుతి అన్నారు. ఆదివారం స్థానిక ఆంజనేయస్వామి కట్ట వద్ద పింఛనదారులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేలతో పాటు మూడు మాసాలకు మరో రూ.3 వేలు అదనంగా ఇవ్వడం టీడీపీకే సాధ్యమన్నారు. నాయకులు శివశంకర్, రామాంజనేయులు, అనిల్, దేవేంద్ర, హనుమంతరాయుడు, పోతప్ప, ఆలీఖాన పాల్గొన్నారు.
తాడిపత్రిటౌన: పట్టణంలోని పాతకోటలో ఆదివారం పింఛన్లపై సచివాలయ సిబ్బందికి టీడీపీ నాయకులు అవగాహన కల్పించారు. సోమవారం జరగనున్న పింఛన్ల పంపిణీలో పెంచిన పింఛన మొత్తం రూ.4వేలతోపాటు మూడునెలలకు సంబంధించి రూ.3వేలు కలుపుకొని మొత్తం రూ.7వేలు అందించనున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు బషీర్, ఉస్మాన, హాజి, నాగరాజు, రసూల్, శ్రీహరి, ధనుంజయ్ పాల్గొన్నారు.
బ్రహ్మసముద్రం: మండల కేంద్రంలోని సచివాలయంలో మండల పరిషత సూపరింటెండెంట్ అచ్యుతానంద బాబు ఆధ్వర్యంలో సోమవారం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకలుఉ పాల్గొన్నారు.
గుత్తి రూరల్: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 24 పంచాయితీల్లో ఆదివారం ఎంపీడీఓ శ్రీనివాసులు గ్రామ సభలు నిర్వహించారు. ఆయన మాట్లడుతూ మండలంలో 6237 పింఛన్లు ఉన్నాయని రూ.4.18 కోట్లను సోమవారం ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి అందజేయాలన్నారు. సర్పంచ భరత, రవితేజ నారాయణస్వామి, ఎంపీటీసీ నారాయణస్వామి, ఇషాక్, మాజీ సర్పంచు లక్ష్మీనారాయణమ్మ, సూరీ పాల్గొన్నారు.
పుట్లూరు: మండలంలో సోమవారం నిర్వహించే పింఛన్ల పంపిణీకి టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇనచార్జిలు హాజరై విజయవంతం చేయాలని ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శననాయుడు, మండల కన్వీనర్ బాలరంగయ్యలు ఒక ప్రకటనలో కోరారు. ఆయా గ్రామాల్లో అధికారులకు చేదోడుగా ఉంటూ వృద్ధులకు పింఛన డబ్బులు అందించాలని కోరారు.
Updated Date - Jun 30 , 2024 | 11:43 PM