ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

OPDR: హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచాలి

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:52 PM

హంద్రీనీవా ప్ర ధాన కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఓపీడీఆర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాసులు అన్నా రు. స్థానిక సీపీఐఎంఎల్‌ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1988లో ప్రారంభమైన ప్రాజెక్టు 35 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం దారుణమన్నారు.

Speaking Srinivas

గుంతకల్లుటౌన, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా ప్ర ధాన కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ఓపీడీఆర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాసులు అన్నా రు. స్థానిక సీపీఐఎంఎల్‌ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1988లో ప్రారంభమైన ప్రాజెక్టు 35 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడం దారుణమన్నారు. 2012-13లో మొదటి దశలో జీడిపల్లికి హంద్రీనీవా నీళ్లు వచ్చాయన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రెండో దశలో కాలువ పనులు పూర్తి చేసి గొళ్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లకు నీరు అందించారన్నారు. మూడేళ్ల కిందట హంద్రీనీవా కాలువలో 9 నెలలు నీరు ప్రవహించిందన్నారు. 40టీఎంసీలు నీరు వచ్చినా ఉమ్మడి జిల్లాలో కేవలం 160 చెరువులను అరకొరగా నింపారన్నారు. జీడిపల్లి నుంచి చిత్తూరు జిల్లా వరకు కాలువ వెడల్పు చేయాలన్నారు. హంద్రీనీవా కాలువ నుంచి పిల్లకాలువలు ఏర్పాటు చేసి రాయలసీమలోని 4జిల్లాల్లో 6,02,500ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్నారు. హంద్రీనీవా కాలువ నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రత్యేక బడ్టెట్‌ను ప్రభుత్వం విడుదల చేసి రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. 2009లో ప్రారంభించిన హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పీఏబీర్‌ ప్రాజెక్టులో 11 టీఎంసీలు నీరు నిల్వ ఉండేలా నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఐఎ్‌ఫటీయూ జిల్లా ప్రఽధాన కార్యదర్శి బీ సురేష్‌, సభ్యులు జిలాన, సత్తార్‌, బాషా, నారాయణ, విశ్వనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:52 PM