UPADIHAAMI : ఇంద.. చందా..!
ABN, Publish Date - May 18 , 2024 | 12:38 AM
నువ్వు మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా కొనసాగాలంటే మీ ఊర్లో ఎన్నికల ఖర్చు పెట్టుకో.. లేదంటే వేరేవాళ్లకు అవకాశం ఇస్తాం..’ ఇదీ.. పోలింగ్‌కు ముందు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వైసీపీ నాయకులు పెట్టిన షరతు. వారు ఇవ్వలేకపోతే మళ్లీ ఆ పోస్టు దక్కదని భయపడ్డారు. డబ్బులు సమకూర్చేందుకు శింగనమల నియోజకవర్గంలో అనేక గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలుకు పాల్పడినట్లు సమాచారం. తప్పుడు మస్టర్లతో లక్షలాది రుపాయల స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్‌కు ...
మా పోస్టు మాకే ఇవ్వాలి..
వైసీపీ నేతలకు ఫీల్డ్ అసిస్టెంట్ల విరాళం..
ఉపాధి పనుల్లో కాజేసి.. ఎన్నికల్లో ఖర్చు
బుక్కరాయసముద్రం, మే 17: ‘నువ్వు మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా కొనసాగాలంటే మీ ఊర్లో ఎన్నికల ఖర్చు పెట్టుకో.. లేదంటే వేరేవాళ్లకు అవకాశం ఇస్తాం..’ ఇదీ.. పోలింగ్‌కు ముందు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు వైసీపీ నాయకులు పెట్టిన షరతు. వారు ఇవ్వలేకపోతే మళ్లీ ఆ పోస్టు దక్కదని భయపడ్డారు. డబ్బులు సమకూర్చేందుకు శింగనమల నియోజకవర్గంలో అనేక గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలుకు పాల్పడినట్లు సమాచారం. తప్పుడు మస్టర్లతో లక్షలాది రుపాయల స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్‌కు ముందు వైసీపీ నేతల డిన్నర్లు, ఇతర ఖర్చులకు నగదు సమకూర్చారు. బుక్కరాయసముద్రం మండలంలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు నెలల్లో
విచ్చవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. దయ్యాలకుంటపల్లి, పసులూరు గ్రామాల్లో రోజూ పనికి 45 నుంచి 50 మంది వస్తే... ఏకంగా 200 మంది వచ్చినట్లు మస్టర్లు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉన్నతాధికారులు ఇతర పనుల్లో ఉండడం ఫీల్డ్ అసిస్టెంట్లకు కలిసి వచ్చింది. అక్కడ కొల్లగొట్టిన డబ్బులు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖర్చుకు ఇచ్చినట్లు తెలిసింది.
మాకే ఇవ్వాలి..
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు తిరిగి తమే ఇవ్వాలని ఆ పార్టీ నాయకులతో కొందరు మాట తీసుకున్నట్లు తెలిసింది. ప్రతి పంచాయతీలో స్థానిక నాయకులకు వారు ఎన్నికల ఖర్చులకు చందా ఇచ్చినట్లు తెలిసింది. కొన్ని గ్రామాల్లో డిన్నర్లు, ఎన్నికల ముందు ఖర్చుల వీరే భరించినట్లు సమాచారం. వైసీపీ నేతలకు ఎన్నికల ప్రచారం సమయంలో ఆర్థిక ఇబ్బందిలు లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా వైసీపీ తరఫున బహిరంగంగా ప్రచారం చేశారు. దీంతో వారిపై వేటు పడింది. మరి కొందరు పరోక్షంగా పార్టీ కోసం పనిచేశారు.
దోచేస్తున్నారు..
జాబ్ కార్డు ఉంటే చాలు.. పనికి రాకపోయినా మస్టర్‌లో పేరు నమోదు చేసుకుని ఉపాధి సొమ్మును స్వాహా చేస్తున్నారు. దయ్యాలకుంటపల్లిలో వైసీపీ ప్రజా ప్రతినిధి సోదరుడు ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉన్నాడు. ఆ గ్రామంలోని గువ్వలకొండపై ఫారంపాండ్ పని చేపట్టారు. ఓ మేట్ పరిధిలో 78 మంది కూలీలు పనిచేసినట్లు మస్టర్‌లో చూపించారు. వాస్తవంగా 23 మంది కూలీలే పనిచేశారు. మిగిలిన 55 మంది పేర్లు అనధికారికంగా చేర్చారు. వారి పేరిట వచ్చే డబ్బులో ఒక్కొక్క కూలీకి రూ.400 ఇచ్చి.. మిగిలినది స్వాహా చేసినట్లు తెలిసింది. పసులూరు గ్రామంలో 70 మంది కూలీలు పనికి పోతే... 200 మంది పనిచేసినట్లు మస్టర్‌లో చేర్చారని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా పనిచేయని కూలీల పేర్లు చేర్చి గత మూడు నెలల్లో లక్షలాది రూపాయుల స్వాహా చేసినట్లు సమాచారం. ఇందులో వచ్చిన నగదులో రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరుకు ఎన్నికల ఖర్చులకు ఇచ్చినట్లు సమాచారం.
చర్యలు తీసుకుంటాం..
ఉపాధి పథకంలో తప్పుడు మస్టర్లపై విచారిస్తాం. అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌లపై చర్యలు తీసుకుంటాం. పనులు చేసే చోట ఇకపై తనిఖీలు చేస్తాం. రెండు నెలలు నుంచి మండలంలో చేసిన పనులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు వేసిన మస్టర్లును క్షుణంగా తనిఖీ చేస్తాం. అవినీతికి పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. నిధులను రికవరీ చేస్తాం.
- పోలేరయ్య, ఏపీఓ
అధికారుల నిర్లక్ష్యం..
డ్వామా అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయి. అవినీతి జరుగుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ఆ పార్టీకి చందాలు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన చాలామందిపై చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
- నల్లప్ప, సీపీఎం జిల్లా నాయకుడు
రికవరీ చేయాలి..
ఉపాధి హామీ పథకంలో గత మూడు నెలలో ఫీల్డ్ అసిస్టెంట్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. దొంగ మస్టర్లు వేసి అందులో వచ్చిన అవినీతి సొమ్మును వైసీపీ నేతలకు చందాలు ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హమీ పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలి. కాజేసిన సొమ్మును రికవరీ చేయాలి.
- పర్వతనేని శ్రీధర్‌బాబు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 18 , 2024 | 12:38 AM