ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SKU: నూతన ఆవిష్కరణలే దేశాభివృద్ధి సూచికలు

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:40 PM

సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలే దేశాభివృద్ధి సూచికలని జేఎనటీయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాల బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Anantaram and Satyanarayana presenting the cups to the students

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 31: సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలే దేశాభివృద్ధి సూచికలని జేఎనటీయూ డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాల బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్‌ సత్యనారాయణతోపాటు కళాశాల చైర్మన అనంతరాముడు, వైస్‌ చైర్మన రమేష్‌ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో భారత నాల్గవస్థానంలో ఉందన్నారు. ప్రథమ స్థానంలోకి వెళ్లాలంటే సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సృష్టించాలని విద్యార్థులకు సూచించారు. చైర్మన అనంతరాముడు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కళాశాలలో ఇంజనీరింగ్‌ విద్యనందిస్తున్నామని తెలిపారు. అనంతరం నిర్వహించిన కీడ్రాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కప్‌లను అందజేశారు. విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:40 PM

Advertising
Advertising