ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ANGANVADI INSPECTION: అంగనవాడీ కేంద్రాల తనిఖీ

ABN, Publish Date - Jun 27 , 2024 | 11:59 PM

మండలంలోని పలు అంగనవాడీ కేంద్రాలను సీడీపీఓ అనురాధ గురువారం తనిఖీ చేశారు. ఎగువ గంగంపల్లిలోని రెండు అంగనవాడీ కేంద్రాలు, ఎర్రయ్యగారిపల్లి, గోరంట్ల-5వ అంగనవాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

CDPO examining records at Gorantla Anganwadi Centre

గోరంట్ల, జూన 27: మండలంలోని పలు అంగనవాడీ కేంద్రాలను సీడీపీఓ అనురాధ గురువారం తనిఖీ చేశారు. ఎగువ గంగంపల్లిలోని రెండు అంగనవాడీ కేంద్రాలు, ఎర్రయ్యగారిపల్లి, గోరంట్ల-5వ అంగనవాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కేంద్రాలోని రికార్డులు, స్టాక్‌ రిజిష్టర్లు తనిఖీ చేసి, పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు కూరగాయాలు సేకరించి, నాణ్యమైన ఆహారం అందించాలని కార్యకర్తలను ఆదేశించారు. ప్రజలనుంచి ఎలాంటి ఫిర్యాదు అందినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతోపాటు సూపర్‌వైజర్‌ రజిత, అంగనవాడీ కార్యకర్తలు ఉన్నారు.

అంగనవాడీ, బీసీ హాస్టల్‌..

అగళి: అంగనవాడీ కేంద్రాలు, బీసీ హాస్టల్‌ను తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంఈఓ-2 చంద్రశేఖర్‌ నాయుడు గురువారం తనిఖీ చేశారు. మండలంలోని మధూడి బీసీ హాస్టల్‌, అగళి బీసీ హాస్టల్‌ను వారు పరిశీలించారు. ఆయా హాస్టళ్లలో విద్యార్థుల హాజరు, బోజన వసతి, పరిసరాల పరిశుభ్రత తదితర వాటిపై ఆరాతీశారు. గత యేడాది పరీక్షా ఫలితాలు ఎలా ఉన్నాయి, కష్టపడి బాగా చదవి ర్యాంక్‌ తీసుకురావాలని సూచించారు. తహసీల్దార్‌ వెంట వార్డన సికిందర్‌బాషా, సిబ్బంది ఉన్నారు. మండల కేంద్రంలోని నాలుగు అంగనవాడీ కేంద్రాలను వారు తనిఖీ చేశారు.

Updated Date - Jun 27 , 2024 | 11:59 PM

Advertising
Advertising