ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NASANAKOTA PEOPLE: ఆలయంలో దోపిడీపై విచారణ చేయించండి

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:36 PM

జిల్లాలో ప్రసిద్ది చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో గత ఐదేళ్లలో జరిగిన దోపిడీపై విచారణ చేయించాలని ఆ గ్రామ పంచాయతీ ప్రజలు డిమాండ్‌చేశారు. దీనిపై వారు శనివారం వెంకటాపురంలో ఎమ్మెల్యే పరిటాలసునీతకు వినతిపత్రం అందజేశారు.

People of Nasanakota Panchayat giving petition to MLA Paritala Sunitha

రామగిరి, ఆగస్టు 3: జిల్లాలో ప్రసిద్ది చెందిన నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో గత ఐదేళ్లలో జరిగిన దోపిడీపై విచారణ చేయించాలని ఆ గ్రామ పంచాయతీ ప్రజలు డిమాండ్‌చేశారు. దీనిపై వారు శనివారం వెంకటాపురంలో ఎమ్మెల్యే పరిటాలసునీతకు వినతిపత్రం అందజేశారు. గత ఐదేళ్లుగా ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి వివరించారు. 2019కి ముందు ఇక్కడ ఆలయ కమిటీ ఉండేదని ఆలయానికి వచ్చే ఆదాయంలో భక్తుల సౌకర్యం కోసం భవన నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అలాగే పాఠశాలలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకిరాగానే అప్పటి ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి ఆలయాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తీసుకెళ్లారన్నారు. అక్కడ తమకు అనుకూలంగా ఉన్న కురుబ ముత్యాలును చైర్మనను చేసుకుని ఈఓగా నరసయ్యను నిర్మించుకున్నారన్నారు.. పూజారులుగా ముత్యాలప్ప, ఎద్దుల అప్పయ్య, లక్ష్మీనారాయణ, పరంధామ వారి కుమారులతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారన్నారు. దాదాపు రూ.5 కోట్లకుపైగా అవినీతి జరిగి ఉంటుందన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి మాజీ ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి, చైర్మనగా ఉన్నన కురుబ ముత్యాలు, బీసీ ముత్యాలు, ఈఓ నరసయ్యతోపాటు అక్కడి పూజారులు, వారి కుమారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వారు విజ్ఞప్తిచేశారు. దీనిపై పరిటాలసునీత స్పందిస్తూ దేవదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ చేయించి అమ్మవారిసొమ్ము ఎవరు తిన్నా కక్కిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Aug 03 , 2024 | 11:36 PM

Advertising
Advertising
<