AMILINENI: కళ్యాణదుర్గం అభివృద్ధే లక్ష్యం: అమిలినేని
ABN, Publish Date - May 01 , 2024 | 11:52 PM
కళ్యాణదుర్గం అభివృద్ధే నా లక్ష్యం అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, పోలేపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ంందర్భంగా సురేంద్రబాబు, పార్థసారథిలకు నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
టీడీపీతోనే అన్ని వర్గాల సంక్షేమం
హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి
బ్రహ్మసముద్రం, మే 1: కళ్యాణదుర్గం అభివృద్ధే నా లక్ష్యం అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, పోలేపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ంందర్భంగా సురేంద్రబాబు, పార్థసారథిలకు నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. నియోజకవర్గానికి జీవనాడి అయిన బీటీపీ, 114 చెరువులకు సాగునీరు, తాగునీరు ఇచ్చి ఛిద్రమైన రోడ్లు బాగు చేయడం, సీసీ రోడ్లు నిర్మాణం, మున్సిపల్ పరిధిలో డ్రైనేజీలు, మున్సిపల్ కాంప్లెక్స్‌లు నిర్మించి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానన్నారు. ఇవన్నీ జరగాలంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని, 13న ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
కార్మికులు సుఖసంతోషాలతో వుండాలని, వారిని జగన ప్రభుత్వంలో బిచ్చగాళ్లుగా తయారుచేశారన్నారు. కార్మికులు పనులు లేక వలసలు వెళుతున్నారన్నారు. కార్మికుల దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించే వారు కానీ సైకో జగన దాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. మనం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామన్నారు. నియోజకవర్గానికి జీవనాడి అయిన బీటీపీ కాలువ తవ్వి పూర్తి చేసి రెండేళ్లలో సాగునీరు తీసుకువస్తామన్నారు. బీటీపీ నీళ్లు వచ్చేది మొదటగా మీ గ్రామానికే అని తప్పకుండా నీళ్లిస్తామన్నారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రైతులకు కూడా ప్రతి యేటా పెట్టుబడి కోసం రూ.20 వేలు ఇస్తారన్నారు. అందుకు ప్రతి ఒక్కరు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సురేంద్రబాబు, అంబికా లక్ష్మీనారాయణలను ఓటు వేసి గెలిపించాలన్నారు. నీరు వస్తే బోర్లు రీచార్జ్ అవుతాయి కావున మా ముందున్న లక్ష్యం సాగు, తాగునీరు ఇవ్వడమే కాకుండా గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరుస్తామన్నారు. టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్దసంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామంలో మౌళిక వసతులు కల్పిస్తాం
కుందుర్పి: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అమిలినేని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. కుందుర్పి మండలంలోని యర్రగుంట, అల్లాపురం, బసాపురం, బేళ్లచింత, బీ కొత్తూరు, మాయదార్లపల్లి గ్రామాల్లో సురేంద్రబాబు సోదరుడు యర్రిస్వామి, సోదరి రాధామాధవి, కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకుసాగారు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో కనీసం గ్రామాలకు రోడ్లు, సీసీ రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. 13వ తేదీన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 01 , 2024 | 11:52 PM